హనుమకొండ, జూన్ 19: హనుమకొండలోని భగత్‌సింగ్‌నగర్, పలవేల్పుల గ్రామంలో 2007 నుంచి నివాసం ఉంటున్న 200 కుటుబాలకు వెంటనే 58వ జీవో ప్రకారం ఇళ్ల పట్టాలు మంజూరు చేయాలని సీపీఎం నాయకులు డిమాండ్ చేసారు. ఈ మేరకు గురువారం సీపీఎం జిల్లా కమిటీ సభ్యుడు గుమ్మడి రాజుల రాములు ఆధ్వర్యంలో హనుమకొండ తహసీల్దార్‌కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంలో ఆయన మాట్లాడుతూ గత 17 సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో 200 కుటుంబాలకుపైగా నివసిస్తున్నారన్నారు.
ఆధార్ కార్డులు, రేషన్ కార్డులు, ఓటర్ ఐడీలు, ఇంటి పన్ను రసీదులు, కరెంట్ బిల్లులు వంటి అన్ని ఆధారాలున్నా ఇప్పటి వరకు పట్టాలు ఇవ్వకపోవడం అన్యాయం అన్నారు. వెంటనే సర్వే జరిపించి 58వ జీవో ప్రకారం పట్టాలు మంజూరు చేయాలని డిమాండ్ చేసారు. ఈ కార్యక్రమంలో వేలు రజిత, మంద సుచందర్, వేలు సుమన్, సాదు సుధాకర్, కుర్ర పద్మావతి, తన్నీరు భూలక్ష్మి, జడ అశ్విని, అచ్చమ్మ, అరుణ, బూతు స్వాతి, తార, కాంతమ్మ, కొయ్యడ అనిత తదితరులు పాల్గొన్నారు.