కాజీపేట, జూలై 31: నగరంలో అన్యాక్రాంత మవుతున్న ప్రభుత్వ భూమిని పరిరక్షించాలని హనుమకొండ జిల్లా సిపిఐ పార్టీ సహాయ కార్యదర్శి మద్దెల ఎల్లేష్ కోరారు. కబ్జాకు గురవుతున్న ప్రభుత్వ భూమిని కాపాడాలని సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో గురువారం కాజీపేట మండల తసీల్దార్ కార్యాలయంలో స్థానిక తహసీల్దార్ బావ్ సింగ్ కు వినతి పత్రం అంద జేశారు. అనంతరం మద్దెల ఎల్లేష్ మాట్లాడుతూ.. మండల పరిధిలోని 31వ డివిజన్ న్యూ శాయంపేట శివారులోని 579 సర్వే నెంబర్ ప్రభుత్వ భూమిలో 39 ఎకరాలు భూ కబ్జా జరుగుతుందన్నారు.
అన్యాక్రాంత మవుతున్న భూమిని కాపాడి గూడు లేని పేదలకు పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు.
సంబంధిత అధికారులు, ప్రజా ప్రతినిధులు కబ్జా అవుతున్న ప్రభుత్వ భూమిని కాపాడ కుంటే సిపిఐ పార్టీ ఆధ్వర్యం లో పోరాటాలు నిర్వహిస్తామని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో హనుమ కొండ జిల్లా సిపిఐ కార్య వర్గ సభ్యులు మునిగాల బిక్షపతి, మండల కార్యదర్శి మాలోత్ శంకర్ నాయక్, కాజిపేట్ మండల సమితి కార్యవర్గ సభ్యులు రాసమల్ల కుమార్, రైఫిల్ పూర్ణచందర్, ధర్మశాల మండల కార్యదర్శి కొట్టే వెంకటేష్, వల్లపు సారయ్య, సాయి పేట కొమురయ్య,రాజయ్య, రాజు తదితరులు పాల్గొన్నారు.