దామెర: దామెర పోలీస్ స్టేషన్‌ను వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ పరిసరాలను పరిశీలించడంతో పాటు పోలీస్ స్టేషన్‌కు సంబంధించిన రికార్డులను సీపీ పరిశీలించారు. స్టేషన్ సిబ్బంది వివరాలతో పాటు, పోలీస్ స్టేషన్ పరిధిలో నేరాలకు సంబంధించి కేసులు నమోదు, గోడవలపై ఆరా తీశారు.
రౌడీ షీటర్ల పై ప్రత్యేక నిఘా ఉంచాలని, మత్తు పదార్థాలు, సైబర్ నేరాలపై ముమ్మరంగా అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని సిబ్బందికి సూచించారు. పోలీస్ స్టేషన్ వచ్చే ఫిర్యారుదలపై తక్షణమే స్పందించి బాధితులకు న్యాయం చేయాలని స్టేషన్ అధికారికి సూచించారు. పోలీస్ కమిషనర్ వెంట ఈస్ట్‌జోన్ డీసీపీ అంకిత్‌కుమార్, ఏఎస్పీ ప్రస్తుతం దామెర స్టేషన్ ఎస్.హెచ్.ఓ ఏ.ఏస్పీ మనన్‌భట్, పరకాల ఏసీపీ సతీష్‌బాబు, పరకాల రూరల్ సీఐ రంజిత్ రావు, ఎస్సై కొంక అశోక్, సిబ్బంది పాల్గొన్నారు.