సుబేదారి, సెప్టెంబర్ 26 : రౌడీషీటర్లపై నిఘా పెట్టాలని, పోలీసు స్టేషన్కు వచ్చే బాధితులకు సత్వర న్యాయం చేయాలని వరంగల్ సీపీ అంబర్ కిశోర్ ఝా పోలీసులను ఆదేశించారు. గురువారం హనుమకొండలోని వరంగల్ పోలీసు కమిషనరేట్లో నేర సమీక్షా సమావేశం నిర్వహించారు. పెండింగ్ కేసుల వివరాలను అడిగి తెలుసుకున్నారు.
దర్యాప్తు వేగంగా చేసి నిందితులకు కఠిన శిక్షలు పడేలా చర్యలు తీసుకోవాలన్నా రు. కేసు నమోదైన వారం రోజుల్లో దర్యాప్తు పూర్తి చేయాలని, ప్రతి రోజు గంటసేపు పెం డింగ్ కేసులపై దృష్టిపెట్టాలని ఆదేశించారు. గంజాయి కేసుల్లో తప్పించుకొని తిరుగుతున్న నిందితులను పట్టుకోడానికి ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేయాలని సూచించారు. నిరంతరం కార్డన్ సెర్చ్ చేయాలని, డ్రంక్ అండ్ డ్రైవ్, రోడ్డు ప్రమాదాలు నివారణకు కృషి చేయాలన్నారు. సమావేశంలో డీసీపీలు షేక్ సలీమా, రాజమహేంద్రవర్మ నాయక్, రవీందర్ పాల్గొన్నారు.