జయశంకర్ భూపాలపల్లి, ఫిబ్రవరి 18 (నమస్తే తెలంగాణ)/ కేసముద్రం: సీసీఐ అధికారులు సర్వర్ సమస్య అంటూ పత్తి విక్రయాలు నిలిపేయడంతో రైతులు పరేషాన్ అవుతున్నారు. పత్తిని ఏం చేయాలో తెలియక తప్పనిసరి పరిస్థితుల్లో ప్రైవేట్ వ్యాపారులకు విక్రయిస్తున్నారు. ఒకసారి ఇంటి నుంచి వాహనంలో తెచ్చిన పత్తిని మళ్లీ తీసుకెళ్లాలంటే వాహనాలు, కూలీల ఖర్చు తడిసి మో పెడవుతున్నది. దీంతో తక్కువైనా దళారులకు విక్రయించి వెళ్తున్నారు. ప్రభుత్వ మద్దతు ధర క్వింటాకు రూ.7,521 ఉండగా, రూ.6500 నుంచి రూ. 7వేల వరకే చెల్లిస్తున్నారని రైతులు వాపోతున్నారు.
శుక్రవారం కేసముద్రం మార్కెట్లో క్వింటాకు రూ.6825, కనిష్ఠంగా రూ. 5,411 పలికింది. సీసీఐ కొనుగోలు చేస్తున్న ధర తో పోలిస్తే క్వింటాకు రూ. 540 కంటే ఎక్కు వ గానే రైతులు నష్టపోతున్నారు. పంట విక్రయాలు చివరి దశకు చేరుకున్న సమయంలో సీసీఐ అధికారులు సర్వర్ సమస్య అంటూ విక్రయాలు నిలిపివేశారని రైతు సంఘాల నాయకు లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సీసీఐ అధికారులు స్పందించి కొనుగో ళ్లు చేపట్టి మద్దతు ధర అందించాలని రైతులు కోరుతున్నారు.
భూపాలపల్లి జిల్లాలో కాటారం మండలంలో రెండు, భూపాలపల్లి మండలంలో ఒకటి, చిట్యాల మండలంలో రెండు పత్తి మిల్లుల్లో సీసీఐ పత్తి కొనుగోళ్లు జరుపుతున్నది. తరచూ ఆన్లైన్ సమస్య తలెత్తుతున్నదని, దీనికి తోడు తేమ పేరుతో కోతలు విధిస్తుండడంతో మద్దతు ధరకు గండి పడుతున్నదని రైతులు వాపోతున్నారు. సీసీఐ ఆన్లైన్ సమస్యతో ఐదు మిల్లుల్లో పత్తి లోడ్‌తో వాహనాలు బారులు దీరాయి.
వారం రోజులైనా సీసీఐ నెలకొన్న సాంకేతిక సమస్యను పరిష్కరించరా?.. ఆది నుంచి ఇదే తీరు. ప్రైవే ట్ మిల్లులకు రైతులు పత్తి అమ్ముతూ నష్టపోతున్నారు. రైతులకు అవగాహన కల్పించ కపోవడంతో సీసీఐ కేంద్రాలకు పత్తి తీసుకుని వచ్చి, తిరి గి ఇంటికి తీసుకెళ్లలేక అదే మిల్లుకు ప్రైవే ట్‌గా అమ్మి నష్టపోతున్నారు. మి ల్లర్లతో ప్రభుత్వం కుమ్మక్కైందా అనే అనుమానాలు కలుగుతున్నాయి. ఇప్పటికైనా పత్తి కొనుగోళ్లు ప్రా రంభించి, దళారీ వ్యవస్థను అరికట్టాలి.
– చింతల రజినీకాంత్, రైతు సంఘం భూపాలపల్లి జిల్లా కార్యదర్శి