ఏటూరునాగారం, జూలై 11 : విద్యా సంవత్సరం పునఃప్రారంభమై నెల రోజులు కావస్తున్న ప్పటికీ ఐటీడీఏ పరిధిలోని గిరిజన సంక్షేమశాఖ ఆశ్రమ పాఠశాలల విద్యార్థులకు నేటికి కాస్మో టిక్స్, యూనిఫాంలు సరఫరా చేయలేదు. దీంతో విద్యార్థులు ఇబ్బందికి గురవుతున్నారు. గ్రామీ ణ ప్రాంతాల్లోని విద్యార్థులను ఆకట్టుకునే విధంగా వ్యవహరించాల్సి ఉన్నప్పటికీ ఇవి కాస్త సరఫ రాకు నోచుకోకపోవడంతో ఉపాధ్యాయులు సైతం ఏం చేయలేని పరిస్థితుల్లో ఉన్నారు. మెరుగైన విద్యను అందించడంలో భాగంగా వసతి, సదుపాయాలు పూర్తి స్థాయిలో కల్పించాల్సి ఉండగా కాస్మోటిక్స్, యూనిఫాం, నోటు పుస్తకాలు అందచేయడంలో జాప్యం తీవ్రంగా చోటు చేసుకుం టుంది. జూన్ నెలలోనే వీటిని విద్యార్థులకు అందించాల్సి ఉండగా సరఫరా, పంపిణీలో నిర్లక్ష్యం చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది.
నోటు పుస్తకాలు ప్రభుత్వం నుంచి నేరుగా సరఫరా చేస్తుండగా కాస్మోటిక్స్‌ను ప్రతి ఏటా జీసీసీకి అప్పగిస్తారు. జీసీసీ ద్వారా అన్ని పాఠశాలకు వీటిని మూడు నెలలకు సరిపోయేలాపంపిణీ చేస్తారు. యూనిఫాంలకు సంబంధించి క్లాత్ ప్రభుత్వం సరఫరా చేస్తే స్థానికంగా ఉండే గిరిజన మహిళలతో కుట్టించి అందచేస్తారు. అయితే పాఠశాలలకు విద్యార్థు లు హాజరవుతున్నప్పటికీ వీటిని మాత్రం అందుకోలేక పోతున్నారు. విద్యార్థులకు కాస్మోటిక్స్ చార్జీల కింద ఏడవ తరగతి వరకు బాలురకు నెలకు రూ. 150, బాలికలకు రూ. 175, ఎనిమి దవ తరగతి నుంచి పదవ తరగతి విద్యార్థులకు బాలురకు రూ. 175, బాలికలకు రూ. 275 చొప్పున చెల్లిస్తుంటారు. వీటిని నేరుగా చెల్లించకుండా జీసీసీ ద్వారా విద్యార్థుల అవసరాలను గుర్తించి టూత్ బ్రష్‌లు, పేస్టులు, ఒంటిసబ్బులు, బట్టల సబ్బులు, కొబ్బరి నూనె, పౌడర్, ఇత ర సామగ్రిని అందజేస్తారు.
పాఠశాలలు ప్రారంభమైన కొద్ది రోజుల్లోనే వీటిని సరఫరా చేస్తే విద్యార్థులకు ఉపయోగకరంగా ఉండేవి. ఇంకా వీటిని అందించకపోవడంతో వారి తల్లిదండ్రులే కొనిస్తున్నారు. ఇదిలా ఉండగా నోటు పుస్తకాలు కూడా పూర్తి స్థాయిలో పాఠశాలలకు పంపిణీ కాలేదు. ఉమ్మడి జిల్లాలో కొన్ని డివిజన్లకు మాత్రమే సరఫరా కావడంతో కొన్ని పాఠశాలల్లో అరకొరగా అందజేసినట్లు తెలుస్తోంది. దీంతో విద్యార్థులు పాత నోటు పుస్తకాలను ఉపయోగి స్తున్నారు. విద్యా సంవత్సరంలో ప్రతి విద్యార్థికి రెండు జతల యూనిఫాంలు, రెండు నైట్ డ్రెస్ లను అందజేయాల్సి ఉండగా వాటిని ఇంకా పంపిణీ చేయలేదు.
వరంగల్ ఉమ్మడి జిల్లా పరిధి లోని మహబూబాబాద్, ములుగు, భూపాలపల్లి, హనుమ్మకొండ, వరంగల్, జనగామ జిల్లాల్లో 56 ఆశ్రమ ఉన్నత పాఠశాలలు, 30 వసతి గృహాలు, ఎనిమిది ప్రాథమికోన్నత పాఠశాలలు, 220 వరకు ప్రాథమిక పాఠశాలలు ఉండగా, వీటిల్లో సుమారు 20 వేల మందికి పైగా విద్యార్థులు చదువుతున్నారు. సకాలంలో విద్యార్థులకు వీటిని సమకూర్చడంలో నిర్లక్ష్యం చోటు చేసు కుంటున్నట్లు తెలుస్తోంది. ఒకవైపు విద్యార్థి సంఘాలు విద్యా రంగ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ బంద్‌లకు కూడా పిలుపునిస్తున్నారు. కాగా, నోటు పుస్తకాలు కొంత మేరకు సరఫరా అయ్యాయని, కాస్మోటిక్స్‌ను త్వరలో అందజేస్తామని, యూనిఫాం క్లాత్ రావాల్సి ఉందని సంబంధిత శాఖ అధికారులు పేర్కొంటున్నారు.