కరీమాబాద్/ నల్లబెల్లి/ ఖా నాపురం/ చెన్నారావుపేట/ కాశీబుగ్గ/ సంగెం/ రాయపర్తి, జూలై 19: ప్రజలు సీజనల్ వ్యాధులపై అప్రమ త్తంగా ఉండాలని వరంగల్ 40వ డివిజన్ కార్పొరేటర్ మరుపల్ల రవి అన్నారు. జీడబ్ల్యూఎంసీ ఆధ్వర్యంలో చేపట్టిన ప్రైడే డ్రైడే కార్యక్రమంలో భాగంగా శుక్రవారం డివిజన్లో దోమల నివారణ చర్య లు చేపట్టారు. నీరు నిల్వ ఉన్న ప్రాంతా ల్లో ఆయిల్ బాల్స్ వేశారు. అలాగే, నల్లబెల్లి మం డలంలోని సాయిరెడ్డిపల్లెలో హెల్త్ క్యాంపు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వైద్యాధికా రి ఆచార్య ప్రజలకు వైద్య పరీక్షలు చేసి మం దులు పంపిణీ చేశారు.
కార్యక్రమంలో వైద్యాధికారులు మహంతి, సాంబమూర్తి, రజిత పాల్గొన్నారు. అంతేకాకుండా ఖానాపురం మండలంలోని అశోక్‌నగర్ సబ్ సెంటర్ ఆధ్వర్యంలో అశోక్‌నగర్ సైనిక్‌స్కూల్ విద్యార్థులకు, ధర్మారావుపేట సబ్‌సెంటర్ పరిధిలోని బాలుతండాలో డాక్టర్ సునీత ఆధ్వర్యంలో వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్య పరీక్షలు చేసి సీజనల్ వ్యాధులపై వివరించారు. శుభ్రత పాటించాలని, ప్రతి ఒక్క రూ కాచి చల్లార్చిన నీటినే తాగాలన్నారు. కా ర్యక్రమంలో వైద్య సిబ్బంది భాస్కర్, సుజా త, రమాదేవి, విజయ, విజయారాణి, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు. అలాగే, చెన్నారావుపేట మండలంలోని అమీనాబాద్, పాపయ్యపేట, కోనాపురంలో వైద్య శిబిరాలు నిర్వహించారు.
ఈ సందర్భంగా మండల వైద్యాధికారి సరోజ వైద్య పరీక్షలు చేసి మందులు అందించారు. కార్యక్రమంలో భవాని, సూపర్వైజర్ సువార్త, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. అంతేకాకుండా వరంగల్ 20వ డివిజన్లోని శాంతినగర్, పద్మనగర్ ఏరియాలో కార్పొరేటర్ గుండేటి నరేంద్రకుమార్ ఇంటింటికీ వెళ్లి పరిసరాలను పరిశీలించారు. ప్రతి ఒక్కరూ శుభ్రత పాటించాలన్నారు. ఏఈ సౌజన్య, వర్క్ఇన్స్పెక్టర్ శరత్, జవాన్ బుట్టి బాబు పాల్గొన్నారు.
13వ డివిజన్లో మలేరి యా సిబ్బందితో కార్పొరేటర్ సురేష్‌జోషి వీవర్స్‌కాలనీ, ఎంహెచ్నగర్ను పరిశీలించారు. కార్పొరేషన్ మలేరియా హెల్త్ ఇన్స్పెక్టర్ మ ధుకర్, రవి, ధర్మారావు, అనిల్, వినయ్, స మ్మయ్య, కొమురమ్మ, శ్యామల పాల్గొన్నారు. సంగెం మండలంలోని మొండ్రాయిలో వైద్య శిబిరం నిర్వహించారు. మొండ్రాయి పల్లెదవాఖాన వైద్యాధికారి శివరాజ్ వైద్య పరీక్షలు నిర్వహించారు.
రాయపర్తి మండలంలోని ఊకల్ పల్లెదవాఖాన ఆధ్వర్యంలో గ్రామంలో వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్యాధికారి ఐశ్వర్య గ్రామస్తులకు వైద్య పరీక్షలు చేసి మందులు పంపిణీ చేశారు.