నర్సంపేటరూరల్, ఆగస్టు 5: ఉద్యమకారులకు ప్రత్యేక కార్పొరేషన్‌ను ఏర్పాటు చేయాలని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి అన్నారు. శనివారం జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో ఉద్యమకారుల గురించి ఎమ్మెల్యే ప్రస్తావించారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంతోమంది ఉద్యమకారులకు చేయూతనిచ్చిందన్నారు. ఉద్యమకారుల సంక్షేమం కోసం సంక్షేమ బోర్డు లేదా ప్రత్యేక కార్పొరేషన్‌ను ఏర్పాటు చేయాలని కోరారు. సంక్షేమ పథకాల్లో ఉద్యమకారులకు పెద్దపీట వేయాలన్నారు. తెలంగాణ ఉద్యమంలో సీఎం కేసీఆర్ నాయకత్వంలో నాడు పని చేసిన ఉద్యమకారుల్లో కొందరు ఆత్మబలిదానాలు చేసుకున్నారని, వారి కుటుంబాలకు సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో న్యాయం జరిగిందన్నారు.
అమరులైన కుటుంబ సభ్యులకు ఉద్యోగాలు ఇవ్వడం, ఆర్థికం భరోసా లాంటి కార్యక్రమాలు చేపట్టారన్నారు. ఇంకా చాలామంది అనేక కేసులు, గాయాలపాలై, ఉద్యోగ అవకాశాలు రాకుండా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారని, వారిని ఆదుకోవాలని కోరారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చిందని, బీసీ రుణాలు, దళితబంధు, ఇతర ప్రత్యేక కార్యక్రమాలు చాలా వరకు ఉన్నాయని వివరించారు. అనేక ఎకనామికల్ స్కీమ్‌లు, డబుల్ బెడ్రూం ఇండ్ల పథకాల్లో ఉద్యమకారులకు తగిన ప్రాధాన్యం కల్పించాలని కోరారు. ఆరోగ్య, విద్య విషయంలో వారి పిల్లలకు ప్రత్యేకంగా అవకాశాలు కల్పించి, అడ్మిషన్లు ఇచ్చే విషయంలో సమస్యలన్నింటినీ మానిటరింగ్ చేయడానికి సంక్షేమ బోర్డు, ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం, సీఎం కేసీఆర్ దృష్టికి సమస్యను తీసుకెళ్లి పరిష్కరించాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యే పెద్ది కోరారు.