ములుగు,ఆగస్టు 30(నమస్తేతెలంగాణ) : వచ్చే మేడారం మహా జాతరలో భక్తుల సౌకర్యార్థం చేప ట్టే అభివృద్ధి పనులను దక్కించుకునేందుకు కాంట్రా క్టు రింగైనట్లు తెలుస్తున్నది. ఆసియా ఖండంలోనే అతిపెద్దదైన ఆదివాసీల మేడారం సమ్మక్క-సారలమ్మ మహా జాతర వచ్చే జనవరి మాసంలో ప్రా రంభం కానున్నది. జాతరకు వచ్చే భక్తులకు సౌకర్యాలు కల్పించేలా ప్రభుత్వం అభివృద్ధి పనులు చేపడుతుంది. అయితే అధికారుల పర్యవేక్షణలో అవకతవకలకు తావు లేకుండా టెండర్లు నిర్వహిస్తుంటా రు.
ఈ నేపథ్యంలో ములుగు జిల్లా కలెక్టర్ గత జూ లై 27న రూ.89.11 కోట్లతో వివిధ శాఖల ద్వారా 130 అభివృద్ధి పనులు చేపట్టేందుకు పరిపాలన అనుమతులను జారీ చేశారు. తాగునీరు, మరుగుదొడ్ల నిర్వహణ కోసం ఆర్డబ్ల్యూఎస్ శాఖకు రూ.4.27 కోట్లు మంజూరు చేశారు. గత జాతరలో అనుభవాలను దృష్టిలో పెట్టుకొని 14 చోట్ల వాటర్ ట్యాంకులు, మరుగుదొడ్ల పనులు చేపట్టేందుకు ఆన్లైన్ టెండర్లను ఆహ్వానించారు. గత జాతరలో పనులు చేసిన కాం ట్రాక్టర్లకు బిల్లులు రాకున్నా ప్రస్తుతం కాంట్రాక్టర్లు పనులు దక్కించుకునేందుకు కొత్త ఎత్తుగడ వేశారు. అర్హులైన కాంట్రాక్టర్లు టెండర్లు వేయకుండా అడ్డుకుంటూ సింగిల్ టెండర్లు దాఖలయ్యేలా చక్రం తిప్పుతున్నట్లు తెలిసింది.
గత జాతరలో లెస్‌కు టెండర్లు వేసిన కాంట్రాక్టర్లకు పనులు దక్కగా, ప్రస్తుతం సింగిల్ టెండర్లతో ప్రభుత్వ ఆదాయానికి గండికొట్టేలా చూస్తున్నారు. నాసిరకంగా పనులు చేసేలా పలు పార్టీల నాయకులతో కుమ్మక్కై నట్లు తెలిసింది. ఈ నెల 4న టెండర్లు తెరవాల్సి ఉం డగా ఇప్పటికే కాంట్రాక్టర్లు, పలు పార్టీల నాయకులు తలా కొన్ని పనులను పంచుకుని ప్రభుత్వ సొ మ్మును కాజేసేందుకు యత్నిస్తున్నట్లు తెలుస్తున్నది. స్థానిక మంత్రితో పాటు కలెక్టర్ స్పందించి సింగిల్ టెండర్ల వెనుక మతలబుపై ఆరా తీయాలని పలువురు కోరుతున్నారు. దీనిపై ఆర్డబ్ల్యూఎస్ సీఈ సురేశ్‌కుమార్ వివరణ కోరగా ఆన్లైన్లో సింగిల్ టెండర్లు పడే అవకాశం లేదని పేర్కొన్నారు.