ఐనవోలు/ధర్మసాగర్, సెప్టెంబర్ 7: సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులకు యూరియా గోస పట్టదా.. అని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ప్రశ్నించా రు. ఆదివారం ఐనవోలు మండలంలోని వెంకటాపురం గ్రామం నుంచి ధర్మసాగర్ మండలం మల్లక్‌పల్లి, ధర్మాపూర్ మీదుగా ఉప్పుగల్లు రిజర్వాయ ర్కు స్టేషన్ ఘన్పూర్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య రెండో విడత చేపట్టిన పాదయాత్రను బీఆర్ఎస్ నాయకుడు ఏనుగుల రాకేశ్‌రెడ్డితో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎర్రబెల్లి మాట్లాడుతూ సీఎం రేవంత్‌రెడ్డి, ఎమ్మెల్యే కడియం శ్రీహరి ప్రజలను నమ్మించి మోసం చేసిన నయవంచకులని అన్నారు. కడియం శ్రీహరి నెల రోజుల్లో ఉప్పగల్లు రిజర్వాయర్ పనులు పూర్తి చేసి నీళ్లు ఇవ్వకపోతే రాజయ్యతో కలిసి నియోజకవర్గంలో ఈ ఎండాకాలం పాదయాత్ర చేస్తానని ఎర్రబెల్లి చా లెంజ్ విసిరారు. నన్ను ప్రశ్నించే ముందు కడియం ఎన్నిసార్లు ఓడిపోయాడో లెక్కవేసుకోవాలన్నారు. ఘన్‌పూర్‌లో ఒక దొంగను గెలిపించుకున్నామని ప్రజలు అనుకుంటున్నారని అన్నారు. ఎవరైనా కాంగ్రెస్ పార్టీ అని వస్తే ఉరికిచ్చిఉరికిచ్చి కొట్టాలన్నారు.
వెంకటాపురం, గర్మిళ్లపల్లి గ్రామాలు ఐనవోలు మండలానికి వచ్చాయి కాబట్టి దత్తత తీసుకుంటామని ఆయన ప్రకటించారు. కార్యక్రమంలో జడ్పీ స్టాండింగ్ కమిటీ మాజీ చైర్మన్ మారపాక రవి, స్టేషన్‌ఘన్‌పూర్ మండల ఇన్చార్జి కర్ర సోమిరెడ్డి, మాజీ కార్పొరేటర్ చింతల యాదగిరి, బీఆర్ఎస్ మండల ఇన్చార్జి గోపాల్‌రావు, కన్వీనర్ తంపుల మోహన్, మాజీ ఎంపీటీసీలు పిండి మాధ వి, మోరే శ్రీనివాస్, గ్రామ పార్టీ అధ్యక్షుడు లాడె రామారావు, నాయకులు ఆకుల కుమార్, మహేందర్‌రెడ్డి, మునిగెల రాజు, లాల్‌మహ్మద్, కమలేశ్, బాబురావు, సుబ్బారావు, జయపాల్‌రెడ్డి, మహేందర్‌రెడ్డి, మాజీ జడ్పీటీసీ మార్గం భిక్షపతి, మాజీ ఎంపీపీ అప్పారావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి, సీఎం రేవంత్‌రెడ్డికి, ఎమ్మె ల్యే శ్రీహరికి రాజయ్య పిండ ప్రదానం చేశారు.
కడియం శ్రీహరి అంటే కమిట్మెంట్ కా దు. కట్లపాము. ఆయనకు దమ్ముంటే ఎమ్మె ల్యే పదవికి రాజీనామా చేయాలి. అన్ని విధాలా లబ్ధి పొందిన తర్వాత తల్లిలాంటి బీఆర్ఎస్ పార్టీకి నమ్మక ద్రోహం చేశావ్. ఉపఎన్నిక ఎప్పుడొస్తుందా.. కడియం శ్రీహరిని ఎప్పుడు ఓడిస్తామని ప్రజలు వేచి చూస్తున్నారు.
– ఏనుగుల రాకేశ్‌రెడ్డి
దేవాదుల ప్రాజెక్ట్ ద్వారా రైతులకు సాగునీరందించడమే లక్ష్యంగా పాదయాత్ర చేపట్టా. ఎమ్మెల్యే కడియంకు ముడుపులు అందకపోవడంతోనే దేవాదుల పనులు పూర్తి కాకుండా అడ్డుకుంటున్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై సీఎం రేవంత్‌రెడ్డికి కనీస పరిజ్ఞానం లేదు. దేవాదుల ప్రాజెక్ట్ పనులు 90 శాతం బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలోనే పూర్తయ్యాయి. రైతులకు సాగునీరందించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైంది. దేవాదుల ప్రాజెక్ట్ పూర్తి చేసి రెండు పంటలకు నీరిచ్చే వరకు పోరాటం చేస్తా.
– డాక్టర్ రాజయ్య, మాజీ ఎమ్మెల్యే