కాంగ్రెస్ నాటి కరెంట్ కష్టాలు వద్దే వద్దు ఏనాడూ ప్రజల బాగోగుల గురించి ఆలోచించని కాంగ్రెస్‌ను నమ్మితే నిండా మునుగుడేనని, ఎట్టి పరిస్థితుల్లోనూ తాము పాత రోజులను కోరుకోవడం లేదని, బీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి ఇలానే కొనసాగాలని తాము కోరుకుంటున్నామని, తమ మంచిచెడ్డల గురించి ఆలోచించే గులాబీ పార్టీ వెంటే ఉంటామని రైతులు, ప్రజలు స్పష్టం చేస్తున్నారు. కాంగ్రెస్ పాలనలో అరిగోస పడ్డ రోజులు ఇంకా గుర్తున్నాయని, కరెంటు లేక, నీళ్లు లేక ఎవుసం సాగక ఏడ్చామని, ఇప్పుడు వచ్చి అదిచేస్తాం.. ఇదిచేస్తామని అసలు ఎవుసం గురించి తెల్వనోళ్లు మాట్లాడుతున్నారని, ఎవుసానికి మూడుగంటల కరెంటు ఎలా సరిపోతుందని ప్రశ్నిస్తున్నారు. ధరణిని తీసేస్తామంటే ఊరుకునేది లేదని, మళ్లీ భూముల పంచాయితీలు తేవద్దని తెగేసి చెబుతున్నారు. ఎన్నో ఏండ్లు పరిష్కారానికి నోచని సమస్యలు కూడా ధరణితో తీరాయని, ఇప్పుడిప్పుడూ భూముల కొట్లాటలు తగ్గుతున్నాయని, మళ్లీ దళారుల రాజ్యం రావద్దని అంటున్నారు. రైతులకు ఏంకావాల్నో తెలిసిన కేసీఆరే మళ్లీ ముఖ్యమంత్రి కావాలని, ఆగంజేసే కాంగ్రెస్ వద్దని ముక్తకంఠంతో చెబుతున్నారు.
నెక్కొండ: కాంగ్రెస్ చెబుతున్న మూడు గంటల కరెంట్, 10హెచ్‌పీ మోటర్లతో రైతులకు అన్నీ కష్టాలే వస్తయి. 10హెచ్‌పీ మోటర్లు వాడితే చిన్న, సన్నకారు రైతుల భూములు కోతలకు గురవుతాయి. 10హెచ్‌పీ విద్యుత్ ప్రెషర్‌కు పంట భూములు ఒడ్లు, పంటచేలలో మొక్కలు కొట్టుకుపోతవి. పొలాలకు మాత్రమే 10హెచ్‌పీ మోటర్‌ను వాడుకుంటరు. ఇతర ఏ పంటలు సాగు చేసినా 10హెచ్‌పీ మోటర్లు పెట్టరు. చిన్న, సన్నకారు రైతులు 10హెచ్‌పీ మోటర్లు కొనే పరిస్థితే ఉండదు. మూడు గంటల కరెంట్ అంటే అందరూ ఒకేసారి మోటర్లు ఆన్ చేస్తరు. మోటర్లు కాలిపోవడం, ట్రాన్స్ఫార్మర్లు కాలిపోతాయి. 10హెచ్‌పీ మోటర్లతో విద్యుత్ సబ్స్టేషన్లలో రూ.కోట్ల నిధులు మళ్లీ పెట్టాల్సి వస్తది. కాంగ్రెస్ హయాంలో రైతులంతా రోడ్లెక్కి ధర్నాలు చేసినా నాణ్యమైన కరెంట్ ఇవ్వలేకపోయిండ్లు. పంట చేతికొచ్చే ముందు ట్రాన్స్ఫార్మర్లు కాలిపోయి పంటలు ఎండిపోయేవి. కాంగ్రెస్ నాయకుల పిచ్చి మాటలను నమ్మొద్దు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఇస్తున్న 24గంటల కరెంట్‌తో రైతన్నలు దర్జాగా వ్యవసాయం చేస్తున్నరు. కాంగ్రెస్ నాటి కరెంట్ కష్టాలను ఎట్టి పరిస్థితుల్లో తెచ్చిపెట్టుకోవద్దు.
చెన్నారావుపేట: వ్యవసాయానికి మూడు గంటల కరెంట్ చాలంటున్న కాంగ్రెస్ నేతల మాటలు పనికిరానివి. వ్యవసాయం తెలిసిన నాయకులైతే గట్ల మాట్లాడరు. అసలు రేవంత్‌రెడ్డికి వ్యవసాయం తెలుసా? ఎప్పుడైనా పంటలు పండించారా? ఏమాత్రం అవగాహన లేకుండా 10 హెచ్‌పీ మోటర్లతో చిన్న, సన్నకారు రైతులకు తీరని నష్టం జరుగుతది. ఈ మోటర్ కొనాలంటే లక్ష ఖర్చు అవుతది. అంతంత ఖర్చు రైతులు భరించలేరు. కాంగ్రెస్ వాళ్ల మాటలు వింటే రైతులు ఆగమైతరు. మా బతుకులను బాగు చేసిన కేసీఆర్‌కు రుణపడి ఉంటాం. నాకున్న 2ఎకరాల్లో వరి పంట వేసిన. గతంలో కాల్వ నీరు లేకపోవడంతో పొలాన్ని బీడుగా వదిలేశారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చాక కాల్వల ద్వారా పుష్కలంగా సాగునీరు అందుతున్నది. రెండు పంటలకు సరిపడా నీరందటంతో అధిక దిగుబడి వస్తోంది. 24గంటల కరెంట్ ఉండడంతో పంటలు బాగా పండి అప్పుల్లేకుండా బతుకుతున్నాం.
ఖానాపురం: రేవంత్‌రెడ్డికి వ్యవసాయం మీద అవగాహనే లేదు. మూడు గంటల కరంటుతో ఎకరం కూడా నీళ్లు పారవు. పంటలెట్ల పండుతాయి? రైతులందరూ ఒకేసారి మోటర్లు పెట్టుకుంటే ఓవర్‌లోడ్‌తో ట్రాన్స్ఫార్మర్లు, మోటర్లు కాలిపోతాయి. రైతులకు చాలా నష్టం వాటిల్లుతుంది. తెలంగాణ ప్రభుత్వం నాణ్యమైన 24గంటల కరంట్ ఇస్తుండడంతో రైతుల సంతోషంగా పంటలు పండించుకుంటున్నరు. రైతులకు రాత్రి పొలాల వద్ద కాడికి పోయే బాధ తప్పింది. పాము, తేలు కాటు వంటి ప్రమాదాలు తప్పాయి. ఎప్పుడు అవసరమైతే అప్పుడే కరంటు వాడుకుంటున్నాం. రైతులందరికీ నాణ్యమైన కరంట్ వస్తున్నది. మూడు గంటల కరంటు చాలు అంటున్న కాంగ్రెస్‌కు ఈ ఎన్నికల్లో మూడినట్లే. వారికి కర్రు కాల్చి వాతపెట్టడం ఖాయం.
నడికూడ : ఇదివరకు కాంగ్రెస్ పాలనలో పడ్డ గోస అంతా ఇంతా కాదు. బాయిల కాడికి పోదామంటే కరెంటు ఎప్పుడొచ్చేది తెల్వదు. ఎక్కువ శాతం అర్ధరాత్రి కరెంటు వచ్చేది. దాని కోసం రాత్రి ఇంత తిని బాయిల కాడికి పోయి ఉండేటోళ్లం. కరెంటు రాగానే చానా మంది రైతులు ఒక్కసారే మోటర్లు ఆన్ చేస్తే స్టార్టర్లు కాలిపోయేవి. ట్రిప్ అయినప్పుడల్లా బాయిల కాడికి పోయేడిది. ఇగ పొత్తుల మోటరు ఉన్నవాళ్లకైతే మరీ ఇబ్బంది ఉండేది. నీరు పారించుకునే వంతు ఉన్ననాడు ఎన్ని పనులున్నా బాయిల కాడే కాపు కాసేటోళ్లం. నాకు ఒకరోజు రాత్రి బాయికాడ పడుకుంటే చీకట్ల పెద్ద తేలు నాలుగైదు సార్లు కరిచింది. ప్రాణం పోయినంత పనైంది. అమ్మో ఆ రోజులు గుర్తుకస్తే నిద్రపట్టదు. కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే 3 గంటల కరెంటే ఇస్తాం అంటున్నారు. ఇగ రైతులం పంట పండించి బువ్వ తిన్నట్టే! సీఎం కేసీఆర్ సారు 24 గంటల కరెంటు ఇచ్చి చాలా మంచి పని చేసిండు. మాకు నచ్చినపుడు పొలాలకు నీరు పారించుకుంటానం. అసలు రాత్రిపూట ఎవ్వరూ పొలానికి పోతలేరు. ఈ విషయంలో సారుకు చేతులెత్తి మొక్కుతున్న.
హనుమకొండ సబర్బన్ : మా బాపు కాంచెళ్లి వ్యవసాయాన్ని చూస్తున్నం. మా చిన్నతనం నుంచి బాయికాడికి పోయేది. అప్పుడు కరంటు సక్కగ ఉండేది కాదు. రోజు రాత్రి పూట కరెంటు పెట్టి పంటలకు నీళ్లు పారిచ్చెటోళ్లం. ఎప్పుడస్తుందో తెలియని కరెంటు కోసం ఎదురుచూస్తుండేది. నేను వ్యవసాయం మొదలు పెట్టినప్పటి నుంచి అదే పరిస్థితి ఉండేది. అట్లాంటిది, ఇప్పుడు కరెంటు విషయంలో వచ్చిన మార్పులు నమ్మలేకుంట ఉన్నయ్. గిట్లాంటి రోజులు వస్తయని ఎన్నడు అనుకోలేదు. ప్రభుత్వం సరఫరా చేస్తున్న నాణ్యమైన కరెంటు వల్ల మేము ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగుల లెక్కనే పొద్దుగాల వస్తున్నం.. చీకటి కాక మునుపే ఇంటికి వెళ్తున్నం. రాత్రి పూట వెళ్లే బాధ తప్పింది. ఇప్పుడు కాంగ్రెసోళ్లు 3 గంటల కరెంటు అని చెబుతున్నరు. దాంతోటి మళ్లీ పాత రోజులు తెస్తరోమోననే అనుమానాలు కలుగుతున్నయ్. మొన్న 10 హెచ్‌పీ మోటరు పెడ్తే గంటలో ఎకురం పారుతదని ఒకాయన అన్నడు. అసలు నాకు తెలిసి ఏ రైతు కూడా 10 హెచ్‌పీ మోటరు పెట్టి వ్యవసాయం చేయడు.
సంగెం : తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధరణి పోర్టల్‌తోనే భూములు భద్రంగా ఉన్నాయి. రైతుకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆన్లైన్లో తమ భూములను చూసుకునే అవకాశం ఉంది. భూములు అమ్మడం, కొనుగోలు చేసేందుకు ఎవరికి ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా క్షణాల్లో రిజిస్ట్రేషన్ అయితాంది. ధరణి పోర్టల్‌ను తీసేస్తామనడం కాంగ్రెస్ పార్టీ చేసే పెద్ద తప్పు. గతంలో మాదిరి పట్వారీ వ్యవస్థ ఉంటే డబ్బులు ఉన్నోడిదే రాజ్యం నడుస్తది. పేదలు తహసీల్ కార్యాలయం చుట్టూ తిరగాల్సిందే. అప్పుడు అవగాహన లేని పట్వారీలు తమకు ఇష్టం ఉన్న వారిపై భూమి రాసుకునే అవకాశం ఉండేది. నిజమైన రైతుకు ఇబ్బందులు వచ్చేవి. ధరణి పోర్టల్‌ను తీసేస్తామన్న కాంగ్రెస్ పార్టీని ఈ ఎన్నికల్లో చిత్తుగా ఓడించాలి. బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధరణి పోర్టల్‌ను యథావిధిగా కొనసాగించాలి.
నడికూడ : కాంగ్రెస్ పాలనలో కరెంటు సక్కంగ ఉండకపోతుండేది. చాలీచాలని కరెంటు.. అది కూడ అర్ధరాత్రి పూట ఇచ్చేది. రాత్రి పూట బాయిల కాడికి భయం, భయంగా పోయేటోళ్లం. కానీ, ఏం చేస్తాం.. భూమిని నమ్ముకుని బతికేటోళ్లం. టార్చి లైట్లు పట్టుకుని రైతులందరం పోయేటోళ్లం. మోట ర్లు అందరం ఒక్కసారే వేసుకునే సరికి కరెంటు సరిపడక మోటర్లు కాలిపోయేది. తెల్లారి మోటర్లు రిపేరు చేసుకుందామని వైండింగ్ షాపులకు వెళితే అక్కడ మస్తు మోటర్లు రిపేరుకు ఉండేది. అట్ల డబ్బులు ఖర్చయ్యేది. మోటరు బాగు చేయించు కోవడానికి రోజుల తరబడి ఎదురు చూపులు ఉండే వి. ఆ దినాలు మళ్ల రావొద్దు. సీఎం కేసీఆర్ సారు 24 గంటల కరెంటుతో మాకు నచ్చిన పుడు బాయి ల కాడికి పోతానం. రాత్రి పూట పోయే దుస్థితి లేదిప్పుడు. చాలా సంతోషంగా ఉన్నది. కాంగ్రెస్ వస్తే మళ్లా మొదటికి వస్తది. వాళ్లు 3 గంటలే కరెంటే అంటున్నరు. ఆ కరెంటుతో మళ్లా ఇబ్బందులు పడే ఓపిక మాకు లేదు. మా మద్దతు బీఆర్ఎస్కే.
హనుమకొండ: ఉమ్మడి రాష్ట్రంలో సొమ్ము ఒకరి ది.. సోకు ఒకరిది అన్నట్టు ఉండేది వ్యవసాయ భూ ముల పరిస్థితి. అంతేకాక భూములు నెర్రెలు వాసి బీడుగా ఉండేవి. పట్వారీ వ్యవస్థతో రైతులు గోస పడేవారు. భూ హక్కుదారుడు ఒకరైతే, అనుభవించే వారు ఇంకొకరు ఉండేవా రు.. ఇలా గత పాలకుల హయాంలో రైతులు భూ ముల విషయంలో అనేక ఇబ్బందులు పడేవారు. సరి చేసుకొనేందుకు వీఆర్ వోలు, ఎమ్మార్వో కార్యాలయాల చుట్టూ తిరిగినా పనులు కాకపోయేది. చేతులు తడపందే పని అయ్యే ది కాదు. భూములు కబ్జాలకు గురయ్యేవి. అసలైన భూ యజమానికి పూర్తి హక్కులు కల్పించాలనే సంకల్పంతో బీఆర్ఎస్ ప్రభుత్వం తీసు కొచ్చిన ధరణి పోర్టల్ రైతులకు భరోసా ఇచ్చింది. వ్యవసాయ భూములపై యాజమాన్య హక్కులు ఉన్నవారి పేర్లే ధరణిలోకి వచ్చాయి. వారి పేరున బ్యాంకులలో రైతు బంధు డబ్బులు పడుతున్నాయి. గతంలో ఉన్న లొల్లులు, పంచాయతీలు ఇప్పుడు లేవు. తతహసీల్దార్ కార్యాలయానికి వెళ్లితే అరగంటలో రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ అంతా పూర్తవు తుంది. ఆన్లైన్ ద్వారా పట్టాదారు పాసు పుస్తకం చేతికి అందుతుంది. ధరణితో ఒకరి భూ మి కబ్జా అయ్యే ఆస్కారం లేదు. ఎందుకంటే భూమి యాజమాన్య హక్కులు ఉ్న రైతే వేలి ముద్ర వేస్తేనే బదలాయింపు అవుతుంది. బీఆర్ ఎస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలతో భూములన్ని పచ్చదనంతో కళకళాడుతున్నాయి. పంటలు సక్రమంగా పండడంతో రైతులు సంతోషంగా జీవిస్తున్నారు. ధరణి తీసివేస్తే మళ్లీ పాత రోజులు, అధికారులు చుట్టూ తిరు గాల్సిన రోజులు వస్తాయి. రైతు లంతా ఒక్కటై ధరణి రద్దు చేయా లనే కాంగ్రెస్ పార్టీ కి గుణపాఠం చెప్పాలి.