హనుమకొండ చౌరస్తా, మార్చి 27: వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి ఎలాంటి భూవివాదంలో జోక్యం చేసుకోలేదని, భూసమస్య పరిష్కరించాలని ఎవరైనావస్తే న్యాయస్థానం దృష్టికి తీసుకువెళ్లమని సూచిస్తారని యూత్ కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి తోట పవన్ అన్నారు. గురువారం హనుమకొండ ప్రెస్‌క్లబ్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కూడా భూ పంచాయతీలు చేయరాదు అని గోడలకు పత్రాలు కూడా అంటించారన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ డివిజన్ అధ్యక్షులు తడక సుమన్, సైండ్ల శ్రీకాంత్, బొంత సారంగం, వల్లెపు రమేష్, యూత్ కాంగ్రెస్ నాయకులు దీపక్‌రెడ్డి, కౌటిల్‌రెడ్డి, సిరబోయిన సతీష్, సంజయ్ పటేల్ పాల్గొన్నారు.