కాంగ్రెస్‌లో మళ్లీ రగడ
కాంగ్రెస్‌లో పార్టీలో మళ్లీ రగడ మెదలైంది. కాంగ్రెస్ పార్టీ నిర్వహించే సమావేశాలకు అందరు నాయకులకు సమాచారం ఇవ్వకపోవటం గొడవకు దారి తీసింది. శనివారం మహబూబాబాద్ జిల్లాకేంద్రంలోని కిరాణా వర్తక సంఘంలో కాంగ్రెస్ పార్టీ సమావేశం నిర్వహించారు
- జిల్లా అధ్యక్షుడు భరత్చందర్ రెడ్డి, కేంద్ర మాజీ మంత్రి పోరిక బలరాం నాయక్ వర్గీయుల మధ్య గొడవ
- ఏఐసీసీ కార్యదర్శి ఎదుటే తన్నుకున్న నాయకులు
మహబూబాబాద్, ఆగస్టు 27 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్‌లో పార్టీలో మళ్లీ రగడ మెదలైంది. కాంగ్రెస్ పార్టీ నిర్వహించే సమావేశాలకు అందరు నాయకులకు సమాచారం ఇవ్వకపోవటం గొడవకు దారి తీసింది. శనివారం మహబూబాబాద్ జిల్లాకేంద్రంలోని కిరాణా వర్తక సంఘంలో కాంగ్రెస్ పార్టీ సమావేశం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా ఏఐసీసీ కార్యదర్శి రోహిత్‌చౌదరి హాజరయ్యారు. సమావేశం తుది దశకు చేరుకునే క్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు భరత్‌చందర్‌రెడ్డి, కేంద్ర మాజీ మంత్రి పోరిక బలరాంనాయక్ వర్గీయుల మధ్య గొడవ జరిగింది.
పార్టీ సమావేశం నిర్వహించినప్పుడు అందరికీ సమాచారం ఇవ్వకపోవడంపై ఇరువర్గాల మధ్య గొడవ ప్రారంభమైంది. ఇందులో జిల్లాకు చెందిన కాంగ్రెస్ ముఖ్య నాయకులకు సమాచారం అందకపోవడంతో ఈ సమావేశానికి రాలేదు. ఈ సందర్భంగా ఏఐసీసీ కార్యదర్శి రోహిత్ చౌదరి మాట్లాడుతూ.. కార్యకర్తలందరూ సమిష్టిగా ఉండి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావాలని సూచించారు. అదే సమయంలో పార్టీ సమావేశం ఉన్నట్టు నాయకులకు సమాచారమే అందడం లేదని, ఇక సమష్టిగా ఎలా ముందుకు సాగుతారని, కార్యకర్తలు స్టేజీ మీద ఉన్న నాయకులతో గొడవకు దిగారు. స్టేజీ మీద ఏఐసీసీ కార్యదర్శి ముందే ఇరు వర్గాలు కొట్టుకున్నాయి. బలరాంనాయక్ జోక్యం చేసుకుని ఆపే ప్రయత్నం చేయగా ఎవరూ వినలేదు.
స్టేజీ పైనే కొట్టుకుంటున్న నాయకులను ఆపడానికి స్టేజీ మీద ఉన్న నాయకులు శ్రమించాల్సి వచ్చింది. పార్టీ సమావేశం నిర్వహించినప్పుడు అందరికీ సమాచారం పంపించాలి . ఇలాంటి ఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా చూసుకోవాలని ఏఐసీసీ కార్యదర్శి రోహిత్ చౌదరి స్టేజీ పైనే చురకలు అట్టించారు. దీంతో గొడవ సద్దుమణిగింది.
Read Today's Latest Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fake Potatoes | మార్కెట్లో విరివిగా కల్తీ ఆలుగడ్డలు.. గుడ్డిగా కొనుగోలు చేస్తే అంతే సంగతి..!
Team India | దక్షిణాఫ్రికా పర్యటనకు భారత మహిళా క్రికెట్ జట్టు.. డిసెంబర్ 9న టూర్ షురూ..!
Almonds | రోజూ కొన్ని బాదంపప్పులను తినడం వల్ల శరీరంలో జరిగే మార్పులు ఇవే.. అధ్యయనాల్లో తేలిన నిజాలు..
Sheikh Hasina | తిరిగి రావడానికి కొత్త పాస్‌పోర్ట్ ఇవ్వండి.. బంగ్లాదేశ్‌ను కోరిన షేక్ హసీనా..!
కారేపల్లి ఎస్ఐగా రమేశ్ బాధ్యతలు స్వీకరణ
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

