హసన్‌పర్తి/కొడకండ్ల, జూలై 28 : రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కష్టపడి పనిచేసి బీఆర్ఎస్ సత్తా చాటాలని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు కార్యకర్తలకు దిశా నిర్దేశం చేశారు. హనుమకొండ జిల్లా హసన్‌పర్తి మండల కేంద్రంలోని డీఎస్కే గార్డెన్లో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు బండి రజినీకుమార్ ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన సన్నాహక సమావేశంలో ఆయన పాల్గొన్నారు. అలాగే జనగామ జిల్లా కొడకండ్ల మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో పలువురు కాంగ్రెస్ నాయకులు ఎర్రబెల్లి సమక్షంలో బీఆర్ఎస్లో చేరగా వారికి గులాబీ కండువాలు కప్పారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి కార్యకర్తను కలుపుకొనిపోయి పార్టీ గెలుపు కోసం పనిచేయాలన్నారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా మళ్లీ కేసీఆరే ముఖ్యమంత్రి అవుతారన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన 420 హామీలతో ప్రజలు మోసపోయారని, ఈ అంశంపై ప్రజల్లో చర్చపెట్టాలన్నారు. స్థానిక ఎన్నికల సర్వేలన్నీ బీఆర్ఎస్ పార్టీవైపే ఉన్నాయన్నారు. రేవంత్‌రెడ్డి పాలనపై ప్రజలు అసంతృప్తితో ఉన్నారన్నారు. త్వరలోనే కమిటీలు వేసి శిక్షణ తరగతులు ఏర్పాటు చేస్తామన్నారు.
సమావేశంలో కార్పొరేటర్ గుగులోత్ దివ్యారాణీ రాజునాయక్, 66వ డివిజన్ అధ్యక్షుడు పాపిశెట్టి శ్రీధర్, కుమార్‌యాదవ్, చంద్రమోహన్, రవీందర్, విక్టర్‌బాబు, చింతల లక్ష్మణ్, నాగరాజు పాల్గొన్నారు. కాగా, బీఆర్ఎస్లో చేరిన వారిలో సింగారం ధర్మేందర్, సింగారం శ్రీనివాస్, కొప్పు వెంకటయ్య, కొప్పు హరీశ్, గంగారం పెద్ద కొమురయ్య, గోధుమల రవి, గోధుమల వెంకటయ్య, కడగుట్ట తండాకు చెందిన కాంగ్రెస్ యూత్ అధ్యక్షుడు ధరావత్ శ్రీనునాయక్ ఉన్నారు.