కాంగ్రెస్ నాయకుల అక్రమాలు అరికట్టాలి
ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో కాంగ్రెస్ నా యకుల అక్రమాలు అరికట్టాలని, కలెక్టర్, సంబంధిత ఉన్నతాధికారులకు రైతులు వి న్నవించినప్పటికీ ప్రభుత్వం, అధికారుల్లో ఎలాంటి చలనం లేదని నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి మండిపడ్డారు.
- కమీషన్ల కోసమే శ్రేణులకు కొనుగోలు కేంద్రాల కేటాయింపు
- రైతులకు బోనస్‌తోపాటు నష్టపరిహారం చెల్లించాలి
- నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి
నర్సంపేట(ఖానాపురం), డిసెంబర్ 1 : ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో కాంగ్రెస్ నా యకుల అక్రమాలు అరికట్టాలని, కలెక్టర్, సంబంధిత ఉన్నతాధికారులకు రైతులు వి న్నవించినప్పటికీ ప్రభుత్వం, అధికారుల్లో ఎలాంటి చలనం లేదని నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి మండిపడ్డారు. సోమవారం ఖానాపురం మండల కేంద్రం లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావే శంలో ఆయన మాట్లాడారు. కేసీఆర్ హ యాంలో తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఐకేపీ మహిళా సంఘాలు, పీఏసీఎస్ సెంటర్లు, ఎఫ్‌పీవోలకు కేటాయించామని, ప్రస్తుతం నిబంధనలకు విరుద్ధంగా కమీషన్ల కోసం ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ నాయకులకు కేటాయించారని అన్నారు.
కాంగ్రెస్ పార్టీ అసెం బ్లీ ఎన్నికలకు ముందు వరంగల్ డిక్లరేషన్ పేరు తో రైతులకు ఇచ్చిన ఏ హామీని పూర్తి గా అమలు చేయలేదన్నారు. రైతు పండించిన అన్ని రకాల పంటలకు బోనస్ చెల్లిస్తామని మ్యానిఫెస్టోలో చెప్పి కేవలం సన్న వడ్లకు మాత్రమే ఇస్తా మని చెప్పి రైతులను మోసం చేసిందని తెలిపారు. యాసంగిలో రైతులు పండించిన సన్న వడ్లకు నేటికీ బోనస్ చెల్లించకపోవడం దారుణమన్నారు. రైతులకు బోనస్ పైసలు చెల్లించిన తర్వాతనే నర్సంపేటలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అడుగు పెట్టాలని కోరారు. గత నెలలో మొంథా తుఫాన్ ప్రభావంతో చేతికొచ్చిన పంటలు దెబ్బతిని రైతులు పెట్టిన పెట్టుబడి కోల్పోవడం బాధాకరమని పేర్కొన్నారు.
ప్రభుత్వం తూతూమంత్రంగా కొన్ని పంట ల కొంత విస్తీర్ణాన్ని మాత్రమే చూపించి చేతులు దులుపుకుందని విమర్శించారు. పత్తి పంట పూర్తిగా దెబ్బతిని దిగుబడి తగ్గిందని, ప్రభుత్వం మాత్రం పత్తికి నష్టపరిహారం ఇవ్వమని చెబుతుందని అన్నారు. తుఫాన్‌తో నష్టపోయిన రైతులకు అన్ని రకాల పంటలకు తక్షణమే నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేశారు. రేవంత్ సర్కారు రైతులకు ఇచ్చిన అన్ని హామీలను నెరవేర్చాలని, తక్షణమే బోనస్, పంట నష్ట పరిహారం చెల్లించాలని, కొనుగోలు కేంద్రా లో జరుగుతున్న అక్రమాలను అరికట్టాలని పెద్ది డిమాండ్ చేశారు.
తొలుత ప్రధాన రహదారి పక్కన రైతులు ఆరబోసిన ధాన్యాన్ని పరిశీలించారు. కార్యక్రమం లో మాజీ ఎంపీపీ వేములపల్లి ప్రకాశ్‌రా వు, ఓడీసీఎంఎస్ చైర్మన్ గుగులోత్ రామస్వామీనాయక్, బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు మహాలక్ష్మీ వెంకటరాంనర్స య్య, వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ బత్తిని శ్రీనివాస్‌గౌడ్, మాజీ సర్పంచులు కాస ప్రవీణ్, వల్లెపు సోమయ్య, భూక్యా పద్మ, వెంకన్న, మాజీ జడ్పీటీసీ బాలునాయక్, ముఖ్య నాయకులు గుగు లోత్ లక్ష్మణ్‌నాయక్, కోరె సుధాకర్, తక్కళ్లపల్లి బాబురావు, జాటోత్ బాలు, శ్రీనివాస్, అశోక్, రవి, రాము తదితరులున్నారు.
Read Today's Latest Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Pakistan | పాకిస్తాన్, ఖైబర్ పఖ్తుంఖ్వాలో ఎమర్జెన్సీ.. పీటీఐ ప్రభుత్వం రద్దు.. సీఎం అరెస్ట్
Agriculture Admissions | వ్యవసాయ కోర్సుల్లో మిగిలిన సీట్లకు కౌన్సెలింగ్.. ఈ నెల 14 నుంచి ప్రారంభం
Kadapa DSP | కడప డీఎస్పీగా భవానీ భాధ్యతల స్వీకరణ
MLC Dasoju Shravan Kumar | ఈ ప్రభుత్వానికి ఎంప్లాయింట్ పాలసీనే లేదు : ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్
IndiGo Flight | ప్రయాణికుడి పవర్ బ్యాంకువల్ల ఇండిగో ఫ్లైట్‌లో మంటలు.. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఎమర్జెన్సీ ల్యాండింగ్..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

