జయశంకర్భూపాలపల్లి, జూలై 30(నమస్తేతెలంగాణ) : ప్రభుత్వ గురుకుల పాఠశాలలు, కళాశాలలపై కాంగ్రెస్ సర్కారుకు పట్టింపులేదని భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమ ణారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం భూపాలపల్లిలోని మైనార్టీ గురుకుల పాఠశాల, కళాశాల, జంగేడులోని కేజీబీవీ బాలికల పాఠశాల, కళాశాలను ఆయన సందర్శించారు. విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మైనార్టీ గురుకులంలో వర్షానికి భవనంపై కప్పు నుంచి నీరు కారుతుండడంతో డైనింగ్‌లో హాలులో పడుకున్నామని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
హాస్టల్ గదులన్నీ నీటితో నిండిపోయాయని, గ్రౌండ్లో చెరువులను తలపించేలా నీరు నిలవడంతో గమనించిన మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి మీ పిల్లలైతే ఇలానే చూస్తూ ఉంటారా..? అంటూ ప్రిన్సిపాల్ రవిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా గండ్ర మాట్లాడుతూ విద్యా ర్థులకు మౌలిక వసతులను కల్పించడంలో కాంగ్రెస్ సర్కారు, సీఎం రేవంత్‌రెడ్డి పూర్తిగా విఫలమైందన్నారు. గురుకుల పాఠశాల చుట్టూ నీరు చేరి చెరువును తలపిస్తున్నదని, పిచ్చి మొకలు, ఎకడి చెత్త అకడే ఉన్నప్పటికీ ప్రభుత్వం, పాలకులు పట్టించుకోకపోవడం సిగ్గుచేటన్నారు.
హాస్టల్లో ఉండే విద్యార్థులంటే ప్రభుత్వానికి ఎందుకంత చులకన..? అని ప్రశ్నించారు. విద్యా శాఖను నడిపించడంలో సీఎం రేవంత్‌రెడ్డి పూర్తిగా విఫలమయ్యాడన్నారు. ప్రభుత్వం సింగరేణికి రూ. 1.50 లక్షలు కిరాయి చెల్లిస్తుందన్నందున జీఎం పట్టించుకొని భవనాన్ని రిపేరు చేయించాలని డిమాండ్ చేశారు. జంగేడులోని కేజీబీవీలో టాయిలెట్స్, విద్యుత్ సరఫరా, ఫ్యాన్స్, బెడ్‌షీట్స్ సరిగా లేవని, నాసిరకం కూరగాయలతో భోజనం పెడుతున్నారని విద్యార్థినులు చెప్పారని, కలెక్టర్ హాస్టల్‌ను పరిశీలించి సౌకర్యాలు కలిగించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ మేకల సంపత్ కుమార్ యాదవ్, కౌన్సిలర్లు కట్ల పూర్ణచందర్, బొంతల సతీశ్‌కుమార్, భోగం నరేందర్, మోతెరాజు, జ్యోతుల మంజుల వెంకటేశ్వర్లు, టీబీజీకేఎస్ భూపాలపల్లి బ్రాంచ్ కమిటీ ఉపాధ్యక్షుడు బడితల సమ్మయ్య, నాయకులు సెగ్గం సిద్ధు, మాడ హరీశ్‌రెడ్డి, మురళీధర్, చిన్నాల ప్రవీణ్‌రెడ్డి, జాడీ అశోక్, మేనం రాజేందర్, కుమారస్వామి, కొల్లోజు దిలీప్‌కుమార్, బుర్ర మనోజ్, మహేందర్, రాకేశ్, వంశీ, మనోహర్, మహేశ్, తిరుపతమ్మ, భాగ్య పాల్గొన్నారు.