జనగామ రూరల్, జనవరి26: ప్రజాపాలనలో భాగంగా జనగామ మండలంలోని ఎర్రకుంట తండాలో ప్రభుత్వ పథకాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు గూండాగిరి చేశారు. పోలీసుల సమక్షంలోనే ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డిపై కోడిగుడ్లు, టమాటాలు, రాళ్లు విసిరారు. అంతకు ముందే గ్రామంలో ఉన్న బీఆర్ఎస్ శ్రేణులను పోలీసులు నిర్బంధించి ఇండ్ల నుంచి బయటకు రాకుండా పికెటింగ్ ఏర్పాటు చేశారు. పక్క గ్రామాల వారిని కూడా అరెస్టు చేసి పోలీస్ స్టేషన్లకు తరలించారు.
ముందుగా ఎమ్మెల్యే పల్లా సభ స్థలానికి చేరుకొని ప్రభుత్వం అమలు చేసే పథకాలను ప్రతి లబ్ధిదారుడికి అందించాలని తాము కూడా కోరుకుంటున్నామని తెలిపారు. ఇంతలో అక్కడే ఉన్న కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పల్లా గోబ్యాక్ అంటూ నినాదాలు చేశారు. పార్టీకి సంబంధించి పాటలు పెట్టి పోలీసుల సమక్షంలోనే డ్యాన్సులు చేశారు. దీంతో ఇది ప్రభుత్వ కార్యక్రమా లేక కాంగ్రెస్ పార్టీ సభా అని ఎమ్మెల్యే ప్రశ్నించారు. కాంగ్రెస్-బీఆర్ఎస్ నాయకులు పోటాపోటీగా నినాదాలు చేశారు. అప్పటికే బీఆర్ఎస్ నాయకులు తాళ్లపల్లి ఆశోక్, గుర్రం కుమార్లను సీఐ దామోదర్ రెడ్డి విచక్షణా రహితంగా చితక బాదడంతో తీవ్ర రక్తస్రావమైంది. కుమార్ మోకాలికి తీవ్రగాయమైంది.
ఈ క్రమంలో మంత్రి శ్రీనివాస్ రెడ్డి పర్యటన రద్దయ్యిందని ఆర్డీవో గోపీరామ్ ప్రకటించడంతో కాంగ్రెస్ నాయకులు ఆగ్రహంతో ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డిపై కోడిగుడ్లు, రాళ్లు, టమాటాలతో దాడి చేశారు. పల్లాతో పాటు పలువురు జర్నలిస్టులు, అధికారులు, బీఆర్ఎస్ నాయకులపై అవి పడ్డాయి. జర్నలిస్టు ఉపేందర్ కన్నుపై దెబ్బ తగలడంతో అతన్ని మండల సర్పంచుల ఫోరం మాజీ అధ్యక్షురాలు బొల్లం శారద, జర్న లిస్టులు పక్కకు తీసుకెళ్లారు. దీంతో పోలీసులు ఎమ్మెల్యే రాజేశ్వర్రెడ్డిని బలవంతంగా అక్కడి నుంచి అరెస్టు చేసి కారులో జనగామకు తరలించారు. అనంతరం సభ నిర్వహించారు. ప్రజల నుంచి వ్యతిరేకత రావడంతో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రాలేదని స్థానికంగా చర్చ జరిగింది.
కాంగ్రెస్ పార్టీ చేస్తున్న దాడులకు భయపడేది లేదని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి స్పష్టం చేశారు. ఆదివారం రాత్రి జనగామలోని క్యాంపు కార్యాలయంలో ఎర్రకుంటతండా మాజీ సర్పంచ్ గుగులోత్ మంజుల, శారద, లాఠీ దెబ్బలతో గాయపడిన వారితో కలిసి విలేకరుల సమావే శంలో మాట్లాడారు. కాంగ్రెస్ నాయకులు దాడులకు పాల్పడితే సీఐ దామోదర్ రెడ్డి వారిని వంతపాడా రన్నారు. బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలను గొడ్డును బాదినట్లు బాదాడని, వరంగల్ కమిషన ర్, డీజీకి ఆధారాలతో సహా ఫిర్యాదు చేస్తున్నామన్నారు.
పోలీసులపై చర్యలు తీసుకోవడంతోపాటు తనపై దాడి చేసిన కాంగ్రెస్ నాయకులపై కేసులు నమోదు చేయాలని పల్లా డిమాండ్ చేశారు. తండావాసులను ముందస్తు అరెస్టుల పేరుతో హింసించారని, కాంగ్రెస్ దురాగతానికి టీవీ-9 జర్నలిస్టు గాయపడితే, పోలీసుల లాఠీచార్జికి 22 మంది బీఆర్ఎస్ నాయకులకు దెబ్బలు తగిలి రక్తాలు కారాయని మండిపడ్డారు. తండాలో అర్హులకు ప్రభుత్వ పథకాలు ఇవ్వకుండా కాంగ్రెస్ నాయకులను మాత్రమే ఎంపిక చేశారన్నారు. ప్రజలు ఎన్నుకున్న ఎమ్మెల్యేను కాదని, ఓడిపోయిన అభ్యర్థిని అందలం ఎక్కిస్తున్నారని అన్నారు.
సమావేశం ప్రారంభం కాకుండానే కాంగ్రెస్ నాయకులు సీఎం రేవంత్ రెడ్డి పాటలతో డ్యాన్సు లు చేయడంతో పోలీసులు కూడా వంతపాడారు. పార్టీ కార్యక్రమంలా వ్యవహరించారు. ప్రొటోకాల్ ప్రకారం తన నియోజకవర్గంలో జరిగే ప్రభుత్వ కార్యక్రమంలో హక్కు ఎమ్మెల్యేకు ఉన్నప్ప టికీ కాంగ్రెస్ నాయకులు పార్టీ సభగా మార్చారు. ఎక్కడికక్కడ పోలీసులు అరెస్టులు చేసి తండాలో భయభ్రాంతులు కల్పించారు.
బీఆర్ఎస్ వెంకిర్యాల గ్రామశాఖ అధ్యక్షుడు తాళ్లపల్లి ఆశోక్, గానుగుపహాడ్ గ్రామ మాజీ స ర్పంచ్ గుర్రం కుమార్ను సీఐ విపరీతంగా కొట్టాడు. ఎందుకు కొడుతున్నావని అడగడంతో మీకు ఇక్కడేం పని అని, ఎందుకొచ్చారంటూ లాఠీచార్జి చేశాడు.