దుగ్గొండి, జనవరి19 : ఆరు గ్యారెంటీలు, 420 హామీలను అమలు చేస్తామని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం వాటిని అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి అ న్నారు. ఆదివారం వరంగల్ జిల్లా దుగ్గొండి మండల కేం ద్రంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం దరఖాస్తుల పేరుతో కాలయాపన చేస్తున్నదని అన్నారు. ఆత్మీయ భరోసా పథకంలో జాబ్ కార్డు కలిగిన ప్రతి ఉపాధి హామీ కూలీకి రూ. 12,000 ఇస్తామని చెప్పి సీఎం రేవంత్‌రెడ్డి మోసం చేశాడన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో 6.47 లక్షలకు పైగా కొత్త రేషన్ కార్డులు మంజూరు చేశామని, ప్రజాపాలనలో 18 లక్షలకు పైగా వచ్చిన దరఖాస్తుల్లో ఇరవై శాతం మంది అర్హులకు ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారని పేర్కొన్నా రు. నియోజకవర్గంలో అధికార పార్టీ ఎమ్మెల్యే ఉన్నా ప్రతిపక్ష పాత్ర పోషిస్తూ అభివృద్ధ్దిని అటకెక్కించాడని, ప్రతిపక్ష పార్టీ కార్యకర్తలపై అక్రమ కేసులను బనాయిస్తూ ఇబ్బం దులకు గురిచేయడమే పనిగా పెట్టుకున్నారని విమర్శించా రు.
గ్రామాల్లో అభివృద్ధి పనులను గాలికొదిలి, స్థానిక సం స్థల ఎన్నికల్లో లబ్ధి పొందేలా పథకాల పేరుతో ప్రజలను మోసం చేయడానికి వస్తున్నారని అన్నారు. ప్రజాపాలన దరఖాస్తులను పక్కకు పెట్టి కులగణన సర్వే వివరాలతో లబ్ధిదారులను ఎంపిక చేయడం ప్రజలను వంచించడమేనన్నారు. ఈ నెల 21వ తేదీ నుంచి నిర్వహించనున్న గ్రామసభల్లో సంక్షేమ పథకాలపై అధికారులు, అధికార పార్టీ నాయకులను నిలదీయాలని కార్యకర్తలకు సూచించారు. కార్యక్రమంలో జడ్పీ మాజీ వైస్ చైర్మన్ ఆకుల శ్రీనివాస్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ పొన్నం మొగిలి, పార్టీ మండల అధ్యక్షుడు సుకినే రాజేశ్వర్‌రావు, మాజీ ప్రజాప్రతినిధులు రేవూరి సురేందర్‌రెడ్డి, గుడిపెల్లి జనార్దన్‌రెడ్డి, పిండి కుమారస్వామి, సింగతి రాజన్న, నాయకు లు ల్యాండె రమేశ్, కామిశెట్టి ప్రశాంత్, గ్రామ పార్టీ అధ్యక్షులు కూస రాజు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.