పాలకుర్తి/రాయపర్తి, డిసెంబర్ 3 : సీఎం రేవంత్‌రెడ్డి దుందుడుకు చర్యలతో కాంగ్రెస్ సర్కారుపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చిందని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. బుధవారం పాలకుర్తిలో తొర్రూరు(జే), శాతాపురం గ్రామాలకు చెందిన కాంగ్రెస్, బీజేపీ నాయకులు పసులాది యాకస్వామి, పసులాది విజయ్, ఎల్లయ్య, చంద్రయ్య, ఆంజమ్మ, యువ ప్రసాద్, కిరణ్‌కుమార్‌తో పాటు శాతాపురం గ్రామానికి చెందిన బీజేపీ గ్రామ శాఖ అధ్యక్షుడు ఆనగంటి వెంకటేశ్, కంజర్ల యాకయ్య, వెంకటమ్మలతో పాటు సుమారు 100 మంది కార్యకర్తలు బీఆర్ ఎస్‌లో చేరారు.
అదేవిధంగా రాయపర్తి మండలంలోని కొండూరు గ్రామ మాజీ ఎంపీటీసీ, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు చిర్ర ఉపేంద్ర, పీఏసీఎస్ డైరెక్టర్ ఆవుల కేశవరెడ్డి, మాజీ వార్డు సభ్యుడు కర్ర ప్రవీణ్‌రెడ్డి, వడ్డెర సంఘం నాయకుడు రాపోలు శ్రీనివాస్ బీఆర్ఎస్లో చేరగా, వారికి ఎర్రబెల్లి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా దయాకర్ రావు మాట్లాడుతూ ప్రతి గ్రామంలో గులాబీ జెండా ఎగరాలన్నారు. సర్వేలన్నీ బీఆర్ఎస్ వైపే ఉన్నాయన్నారు. గడిచిన రెండేళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఒరగబెట్టిందేమీ లేదని, అందు వల్లనే ఆ పార్టీ నాయకులు బీఆర్ఎస్లో చేరుతున్నారని పేర్కొన్నారు. రాష్ట్రంలో అన్ని రంగాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని, ఆ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఎండగడుతూ కేసీఆర్ అమలు చేసిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలన్నారు.
కాంగ్రెస్ బీసీలను మోసం చేసిందని, ఆ పార్టీకి వారు తగిన గుణపాఠం చెప్పాలన్నారు. పాలకుర్తి నియోజక వర్గంలో అభివృద్ధి కనిపించడం లేదన్నారు. గతంలో తాను చేసిన అభివృద్ధి పనులు కూడా ఆగిపోయాయన్నా రు. సర్పంచ్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థుల విజయానికి పార్టీ శ్రేణులు కృషి చేయాలని పిలుపునిచ్చారు. కష్టకాలంలో పార్టీలో ఉన్న ప్రతి కార్యకర్తను కాపాడు కుంటానన్నారు. అదేవిధంగా రాయపర్తి మండలంలోని గణేశ్‌కుంట తండాకు చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకులు మునావత్ దాసు, నరేశ్, దేవేందర్ బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మునావత్ నర్సింహానాయక్ సారథ్యంలో గులాబీ గూటికి చేరారు.
కార్యక్రమంలో బీఆ ర్ఎస్ మండల అధ్యక్షుడు పసునూరి నవీన్, మాజీ జడ్పీటీసీ పుస్కూరి శ్రీనివాసరావు, ఎంపీపీ నల్లా నాగిరెడ్డి, మాజీ సర్పంచ్ నాయిని మల్లారెడ్డి, నాయకులు మాచర్ల ఎల్లయ్య, పాము శ్రీనివాస్, వీరమనేని సోమేశ్వర్రావు, గుంటుకుల సోమనాథం, పసులాది సోమనర్సయ్య, రామిరెడ్డి, గోనె బాబు, కర్ర రవీందర్‌రెడ్డి, దేశగాని ఉపేందర్, పెండ్లి వెంకన్న, ఎల్లాగౌడ్, ఆలకుంట్ల వెంకన్న, గుగులోత్ సోమన్న, బట్టు వీరూనాయక్, మునావత్ రవినాయక్, వెంకటేశ్ తదితరులున్నారు.