వనపర్తి టౌన్, జూలై 24 : బీఆర్ఎస్లోకి వలసలు కొనసాగుతున్నాయి. శుక్రవారం వనపర్తి మండలంలోని చిమనగుంటపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకులు మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి స్వగృహంలో ఆయన సమక్షంలో బీఆర్ఎస్ పార్టీ లో చేరారు. వారికి మాజీ మంత్రి పార్టీ కండు వా కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి మాట్లాడుతూ ప్రజా వ్యతిరేక విధానాలు, విఫలమైన సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి అవగాహన కల్పించాలన్నా రు. పార్టీ కోసం కష్టపడిన ప్రతి కార్యకర్తకు పార్టీ అండగా ఉంటుందన్నారు.
బీఆర్ఎస్ పార్టీలో చేరిన వారిలో కందూరు శాంతయ్య, దండు లక్ష్మయ్య, కందూరు ఎల్లయ్య, చిన్న వెంకటస్వామి, దండు రాజు, పానుగంటి రాజు, గొర్ల సతీశ్, పానుగంటి గోపాల్, గొర్ల రమేశ్, చరణ్, ఆంజనేయులు చంద్రారెడ్డి, బాలయ్య,మధు, రవి తదితరులు ఉన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు గట్టుయాదవ్, అధికార ప్రతినిధి వాకిటి శ్రీ ధర్, జిల్లా మీడియా కన్వీనర్ నందిమల్ల అ శోక్, పానుగంటి రాము, ధర్మ శాస్త్రి, భగవంతుయాదవ్, మైకెల్, పుల్లయ్య, బాలయ్య, పి.రాము, రాజేశ్వర్‌రెడ్డి, శంషుద్దిన్, విష్ణు, కొమ్ము రాము, స్వామి, జి.రాజు ఉన్నారు.