వరంగల్ చౌరస్తా, ఏప్రిల్ 11 : టాస్క్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన జాబ్‌మేళా గందరగోళంగా మారింది. ఏర్పాట్లు చేయడంలో అధికారుల నిర్ల క్ష్యం కారణంగా తోపులాటకు దారితీసింది. శుక్రవారం వరంగల్ రైల్వేస్టేషన్ గూడ్స్‌షెడ్ జంక్షన్‌లోని ఎంకే నాయ డు హోటల్స్ అండ్ కన్వెన్షన్ హాల్లో నిర్వహించిన జాబ్‌మేళాకు ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి పెద్ద ఎత్తున నిరుద్యోగ యువత హాజరైంది. సుమారు 6వేల ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు జరుగుతాయని ప్రచారం చేయడంతో యు వత ఎక్కువ సంఖ్యలో హాజరుకాగా, హోటల్ ఆవరణ కిక్కిరిసిపోయింది.
మంత్రులు కొండా సురేఖ, సీతక్క ఆలస్యంగా రావడం, కార్యక్రమాన్ని ప్రారంభించి, ప్రసంగాలు పూర్తయ్యే వరకు నిరుద్యోగులను లోనికి అనుమతించకపోవడంతో హోటల్ ఆవరణ పూర్తిగా నిండిపోయింది. మంత్రులు తమ ప్రసంగాన్ని ముగించుకొని వెళ్లిపోయాక నిరుద్యోగులను లోనికి అనుమతించడం తో ఒక్కసారిగా తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో హోటల్ ముఖద్వారం వద్ద ఏర్పాటు చే సిన భారీ అద్దాలు పగిలిపోయి ముగ్గురు యువ తు లకు గాయాలయ్యాయి. దీంతో నిరుద్యోగులు భయభ్రాంతులకు గురై హాహాకారాలు చేశారు. పోలీసులు వారిని నిలువరించి గాయాలపాలైన యువతులను స్థానిక హాస్పిటల్‌కు తరలించి చికిత్స అందించారు.
మెగా జాబ్‌మేళాకు ఏర్పాట్లు చేయడంలో కార్పొరేషన్ అధికారులు విఫలయ్యారు. సుమారు 60 కంపెనీలు పా ల్గొంటాయని, 6వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తా మని స్వయంగా మంత్రి కొండా సురేఖ ప్రచారం చేయడంతో సుమారు 10వేల మందికి పైగా హాజరయ్యారు. రిజిస్టర్ చేసుకున్న నిరుద్యోగుల సంఖ్యను చూసైనా ముందస్తు ఏర్పాట్లు చేయలేదు. హోటల్ ఆవరణ ఇరుకు గా ఉండడం, భారీస్థాయిలో నిరుద్యోగులు హాజరు కావ డం, మంత్రులు వెళ్లిపోయే వరకు వారిని లోపలికి అనుమతించకపోవడంతో తీవ్ర ఇబ్బంది పడ్డారు. ఎండ తీవ్రతకు చాలా మంది డీహైడ్రేషన్‌కు గురయ్యారు. కనీసం తా గునీటి వసతి ఏర్పాటు చేయకపోవడంపై మండిపడ్డారు.
ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకొని జీవితంలో ముం దుకు సాగడం అలవాటు చేసుకోవాలని మంత్రులు కొండా సురేఖ, సీతక్క యువతకు సూచించారు. శనివారం టాస్క్ ఆధ్వర్యంలోని జాబ్‌మేళాను ప్రారంభించారు. ముందుగా ప్రభుత్వ నర్సింగ్ ఉద్యోగాలకు ఎంపికైన 17మందికి మంత్రులు, కలెక్టర్‌తో కలిసి నియామక పత్రాలు అందజేశారు. అనంతరం మంత్రి సురేఖ మాట్లాడుతూ రానున్న రోజుల్లో దశలవారీగా 2లక్షల ఉద్యోగాలు భర్తీ చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు. ఉపాధి కల్పనలో తెలంగాణను అగ్రగామిగా నిలుపుతామని చెప్పారు.
మంత్రి సీతక్క మాట్లాడుతూ ప్రాధాన్యతా క్రమంలో ప్రతి జిల్లాలో జాబ్‌మేళాలు నిర్వహిస్తామన్నారు. త్వరలో 14వేల అంగన్వాడీ పోస్టులు భర్తీ చేస్తామన్నారు. వివిధ శాఖల్లో ఖాళీ పోస్టుల వివరాలను సేకరించామని త్వరలో వాటిని భర్తీ చేస్తామన్నారు. మామునూరు విమానాశ్రయ పనులు త్వరలో ప్రారంభిస్తామన్నారు. తద్వారా సాఫ్ట్వేర్ ఉద్యోగాలు గణనీయంగా పెరిగే అవకాశాలు ఉన్నాయన్నారు. కార్యక్రమంలో కలెక్టర్ సత్యశారద, గ్రేటర్ కమిషనర్ అశ్విని తానాజీ వాకడే, అదనపు కలెక్టర్ సంధ్యారాణి, టాస్క్ సీఈవో రెడ్డి, అదనపు కమిషనర్ జోనా, జడ్పీ సీఈవో రాంరెడ్డి, డీఆర్డీవో కౌసల్య, సీఎంహెచ్వో రా జారెడ్డి, డిప్యూటీ కమిషనర్ ప్రసన్నరాణి పాల్గొన్నారు.