హనుమకొండ, ఏప్రిల్ 30 : ఎన్నికలకు ముందు మే 6, 2022న వరంగల్ వేదికగా కాంగ్రెస్ పార్టీ త మ అధినేత రాహుల్‌గాంధీతో రైతు డిక్లరేషన్ ప్రకటించి మోస పూరితంగా అధికారంలోకి వచ్చిందని ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్రావు ఆరోపించారు. గురువారం హనుమకొండ బాలసముద్రంలోని బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో పార్టీ మాజీ అధ్యక్షుడు దాస్యం వినయ్‌భాస్కర్, మాజీ ఉపముఖ్య మంత్రి తాటికొండ రాజయ్య, మాజీ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్‌తో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడా రు. హనుమకొండ ఆర్ట్స్ కళాశాల వేదికగా డిక్లరేషన్‌లో రుణమాఫీ చేస్తామని ప్రకటించారని, ఇందుకో సం రాష్ట్రంలోని రైతులకు రూ. 50 వేల కోట్లు అవసరం కాగా కేవలం రూ. 20 వేల కోట్లు మాత్రమే మాఫీ చేశారన్నారు.
ఎంత మంది రైతులకు రుణ మాఫీ చేశారన్న దానిపై ప్రభుత్వానికి స్పష్టతలేదన్నా రు. 30 శాతానికి మించి రుణమాఫీ జరగలేదన్నా రు. పంటలకు బోనస్ అంతా బోగస్ అయ్యిందన్నా రు. తాము అధికారంలోకి వస్తే రైతు భరోసా రూ. 15 వేలు ఇస్తామని చెప్పి రెండుసార్లు ఎగ్గొట్టారన్నా రు. పంట పెట్టుబడి సమయంలో ఇచ్చే రైతు భరోసాను పంటలు కోసే టైంలో ఇస్తున్నారని విమర్శించారు. అది కూడా ఎకరం, ఎకరం ఇస్తామని అంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వరంగల్ ఉమ్మడి జిల్లాలో 4.5 లక్షల ఎకరాల్లో మకజొన్న పండితే ఎకడా సక్రమంగా కొంట లేరని, అలాగే ధాన్యం కొనుగోళ్లు కూడా జరగడం లేదన్నారు. ఒకో కేంద్రంలో వేయి క్వింటాళ్ల వరకు పంట వచ్చి చేరిందన్నారు.
కాంగ్రెస్ సరార్ పాలనలో యూరియా, విద్యుత్ సక్రమంగా అందడం లేదని, రైతులకు జరుగుతున్న అన్యాయాన్ని తెలిపేందుకు వరంగల్‌లో సదస్సు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఉమ్మడి జిల్లా నుంచి 10 వేల మందితో నిర్వహించే ఈ సదస్సుకు కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరవుతారని తెలిపారు. అయితే సభ నిర్వహణకు అనుమతులు ఇవ్వకుండా అధికారులపై కాంగ్రెస్ ప్రభుత్వం ఒత్తిడి తెస్తున్నదని, అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నదని రవీందర్రావు ఆరోపించారు. సమావేశంలో రైతు సమన్వయ సమితి మాజీ జిల్లా అధ్యక్షురాలు ఎల్లావుల లలితా యాదవ్, కుడా మాజీ చైర్మన్ మర్రి యాదవరెడ్డి, సీనియర్ నాయకులు భరత్ కుమార్‌రెడ్డి, మాజీ కార్పొరేటర్లు చింతల యాదగిరి, ఉడతల సారంగపాణి, జోరిక రమేశ్, నాయకులు పులి రజినీకాంత్, నయీముద్దీన్, సల్వాజి రవీందర్రావు, వెంకన్న, పానుగంటి శ్రీధర్, మూటిక రాజు, బండి రజినీకుమార్ తదితరులు పాల్గొన్నారు.
ప్రతిపక్షంలో పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న రేవంత్‌రెడ్డి పార్టీ అధినేత రాహుత్ గాంధీని తీసుకొచ్చి వరంగల్ వేదికగా చేసిన రైతు డిక్లరేషన్ అమలులో కాంగ్రెస్ విఫలమైంది. రెండున్నరేళ్లుగా రైతులకిచ్చిన హామీలను అమలు చేయడం లేదు. ఎన్నికల ముందు 420 హామీలు, 6 గ్యారెంటీలిచ్చిన కాంగ్రెస్ తెలంగాణ ప్రజలను మోసం చేసింది. అన్ని వర్గాలకు అన్యాయం చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నది. కాంగ్రెస్ చేసిన మోసాన్ని ఎండ గట్టేందుకు మే 6న ఓరుగల్లు వేదికగా పది వేల మందితో రైతుసభ నిర్వహిస్తున్నాం.
– దాస్యం వినయ్‌భాస్కర్, బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా మాజీ అధ్యక్షుడు
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ రైతును రాజును చేస్తే, ప్రస్తుత సీఎం రేవంత్‌రెడ్డి వారి ఉసురు తీస్తున్నడు. రెండున్నరేండ్ల కాంగ్రెస్ పాలనలో రాష్ట్రంలో ఇప్పటి వరకు 813 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. అన్నదాతలకు కాంగ్రెస్ ఇచ్చిన ఏ ఒక హామీ అమలు చేయలేదు. రాజకీయ లబ్ధి కోసం రేవంత్ రెడ్డి నాటకాలు ఆడుతున్నారు. కౌలు రైతులు, రైతు కూలీలకు ఇస్తామన్న భరోసా నేటికీ అతీగతి లేదు. పంటల కొనుగోళ్లు సక్రమంగా జరగడం లేదు. అవసరం మేరకు గన్నీ బ్యాగ్‌ల సరఫరా చేయడం లేదు. పంటకు మద్దతు ధర దక్కపోవడంతో రైతులు ప్రైవేట్‌లో అమ్ముకుంటున్నరు. కొనుగోలు కేంద్రాల్లో కనీస వసతులు లేవు. రైతుల పక్షాన బీఆర్ఎస్ పోరాడుతుంది.
– తాటికొండ రాజయ్య, మాజీ ఉప ముఖ్యమంత్రి
కాంగ్రెస్ ఇచ్చిన రైతు డిక్లరేషన్, 6 గ్యారెంటీలు, 420 హామీల అమలు కోసం బీఆర్ఎస్ పోరాడుతుంది. అలవికాని హామీలిచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం వాటిని అమలు చేయక రైతుల నోట్లో మట్టి కొట్టింది. ఈ నెల 6న హనుమకొండ హంటరోడ్డులోని గ్రీన్వుడ్ స్కూల్ పక్కనున్న ప్రైవేట్ స్థలంలో రైతు సదస్సు నిర్వహిస్తున్నాం. అలాగే 2027లో రైతుల పక్షాన ఒక సభ, 2028లో మరో భారీ బహిరంగ సభ నిర్వహిస్తాం. ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ నేతలు, ప్రస్తుత మంత్రి సీతక డిక్లరేషన్ ప్రకటన సమయంలో వేదికపై ఉన్నారు. సీతక రీల్ లైఫ్ నుంచి రియల్ లైఫ్‌లోకి వచ్చి డిక్ల రేషన్ అమలుకు కృషి చేయాలి.
– నన్నపునేని నరేందర్, మాజీ ఎమ్మెల్యే