హనుమకొండ చౌరస్తా, మే 23 : కేయూ లో మెస్‌లను మూసివేస్తామని హాస్టల్ డైరెక్టర్ సర్యులర్ జారీ చేయడాన్ని నిరసిస్తూ పీడీఎస్‌యూ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో యూ నివర్సిటీ పరిపాలనా భవనం ఎదుట వంట సామగ్రితో ఆందోళనకు దిగారు. రిజిస్ట్రార్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేసి దిష్టిబొమ్మ దహ నం చేశారు.
ఈ సందర్భంగా వర్సిటీ పీడీఎస్‌యూ కార్యదర్శి మర్రి మహేశ్ మాట్లాడు తూ..గ్రూప్స్, డీఎస్సీ, వివిధ రకాల కాంపిటీటివ్ పరీక్షలు త్వరలో జరుగనున్నాయని, ఈ సమయంలో మెస్‌లను మూసివేయడం తగదన్నారు. ఈ క్రమంలో హాస్టళ్ల డైరెక్టర్ సమ్మ య్య అక్కడికి వచ్చి యథావిధిగా మెస్‌లను నడిపిస్తామని హామీ ఇవ్వడంతో విద్యార్థులు నిరసన విరమించారు. విద్యార్థి నాయకులు వినయ్, రాజు, శ్రవణ్, అర్జున్ పాల్గొన్నారు.