మహబూబాబాద్ : తొర్రూరు మండల కేంద్రంలోనీ బీఆర్ఎస్ పార్టీ క్యాంపు కార్యాలయంలో మంగళవారం బీఆర్ఎస్ నియోజకవర్గ స్థాయి ముఖ్యనాయకులు సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ నాయకురాలు ఝాన్సీ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పాలకుర్తి నియోజకవర్గానికి చెందిన సీనియర్ నాయకులు, మండల అధ్యక్షులు, కార్యకర్తలు ఈ సమావేశంలో పాల్గొని, ఝాన్సీ రెడ్డి మాటలను తీవ్రంగా ఖండించారు. బీఆర్ఎస్ పార్టీకి చెందిన మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుపై ఝాన్సీ రెడ్డి చేసిన విమర్శలు మర్యాదలకు భిన్నంగా ఉన్నాయని మండిపడ్డారు.
“తానే రైఫిల్, తానే ట్రిగ్గర్” అంటూ చేసిన బెదిరింపులను నాయకులు తీవ్రంగా విమర్శించారు. భారతీయ పౌరసత్వం లేని ఝాన్సీ రెడ్డి ఇతరులపై విమర్శలు చేయడం అనవసరమని అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ.. తన పార్టీని నియంత్రించలేని ఝాన్సీ రెడ్డి ప్రజాప్రతినిధులను విమర్శించడం అసహ్యకరమని పేర్కొన్నారు. ధైర్యం ఉంటే యశస్విని రెడ్డినీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయించి మళ్లీ ప్రజల్లోకి వెళ్లాలని సవాల్ విసిరారు. దయాకర్ రావును బెదిరించేందుకు ఝాన్సీకి ధైర్యమే లేదని పేర్కొన్నారు.సమావేశం అనంతరం స్థానిక పోలీస్ స్టేషన్లో ఝాన్సీ రెడ్డిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు.
బీఆర్ఎస్ కార్యకర్తలు, యువజన విభాగం, సోషల్ మీడియా ప్రతినిధులు ఈ పిటిషన్‌ను సమర్పించారు.
ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు పసుమర్తి సీతారాములు, మాజీ జెడ్పీటీసీ మంగలపల్లి శ్రీనివాస్, మాజీ ఎంపీపీ తూర్పటి అంజయ్య, పార్టీ పట్టణ వర్కింగ్ ప్రెసిడెంట్ ఏ.ప్రదీప్‌రెడ్డి, పార్టీ కార్యదర్శి కుర్ర శ్రీనివాస్, మాజీ కౌన్సిలర్లు, పార్టీ సీనియర్ నాయకులు ఎన్నమనేని శ్రీనివాసరావు, సీనియర్ నాయకులు శామకూరి ఐలయ్య, కర్నే రాజు, ఎస్.కె అంకుస్, కాలు నాయక్, పేర్ల జంప, జనార్ధన్ రాజు, పసునూరి నవీన్, ఈదురి ఐలయ్య, తీగల దయాకర్, సిందే రామోజీ, నరసింహ నాయక్, తదితరులు పాల్గొన్నారు.