కాజీపేట, ఆగస్టు 06 : అన్ని అర్హతలు ఉన్న కాజీపేట రైల్వే జంక్షన్‌ను రైల్వే డివిజన్‌గా ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తానని వరంగల్ ఎంపీ పసునూరి దయాకర్ అన్నా రు. అమృత్ భారత్ పథకంలో చేపట్టిన 508 రైల్వే స్టేషన్ల పునరాభివృద్ధి పనుల శంకుస్థాపన పనులను ప్రధాని నరేంద్రమోదీ ఆదివారం ఢిల్లీ నుంచి ఆన్లైన్లో వర్చువల్‌లో ప్రారంభించారు. ఈ మేరకు రైల్వే అధికారులు కాజీపేట రైల్వే జంక్షన్ ప్లాట్‌ఫాంపై ప్రత్యేక వేదికను ఏర్పాటు చేశారు. రైల్వే నోడల్ అధికారి సీనియర్ డీఈఈ ప్రశాంత్ కృష్ణ సాయి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో వరంగల్ ఎంపీ పసునూరి దయాకర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. రైల్వే జనరల్ ఇన్స్టిట్యూట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాల్లో కళాకారులు చేసిన నృత్యాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఇటీవల రైల్వేశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన పోటీల్లో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ప్రధాని మోదీ ప్రసంగం అనంతరం ఎంపీ దయాకర్ మాట్లాడుతూ కాజీపేట రైల్వే జంక్షన్ అమృత్ భారత్‌కు ఎంపిక కావడం అభినందనీయమన్నారు.
రైల్వే పరంగా కాజీపేట రైల్వేజంక్షన్ ప్రాంతం అన్ని విధాలా వెనుకబడిందన్నారు. భవిష్యత్‌లో వరంగల్ ఉమ్మడి జిల్లా అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వం విభజన చట్టంలో పొందుపరిచిన కోచ్ ఫ్యాక్టరీని ఇవ్వకుండా వ్యాగన్ తయారీ పరిశ్రమను మంజూ రు చేసి మభ్యపెట్టిందన్నారు. కేంద్ర ప్రభు త్వం తెలంగాణపై సవతితల్లి ప్రేమను ప్రదర్శిస్తోందన్నారు. కేంద్ర ప్రభుత్వం అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో నడుపుతున్న వందే భారత్ రైళ్లతో పాటు సామాన్యుల కోసం ప్యా సింజర్ రైళ్లను నడపాలన్నారు. కార్యక్రమం లో మాజీ ఎమ్మెల్యేలు మార్తినేని ధర్మారావు, కొండేటి శ్రీధర్, కార్పొరేటర్ విజయశ్రీ రజా లీ, నాయకులు రావు పద్మా అమరేందర్‌రెడ్డి, గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి, మాజీ డీఐజీ కృష్ణ ప్రసాద్, హనుమకొండ ఆర్డీవో రమేశ్, తహసీల్దార్ బావు సింగ్, అధికారులు ఏడీఈఎన్ ఎంఆర్కే రాజు, ఏడీఎస్టీ గురుమూర్తి, ఎస్ఎస్ఈ కమలాకర్, సీబీఎస్‌ఆర్ సజ్జన్ లాల్, సీటీఐ విజయ్‌కుమార్, ఆర్పీఎఫ్ సీఐ సంజీవరావు, పీడబ్ల్యూఐ విజయ్‌శంకర్, స్టేషన్‌మేనేజర్ సత్యనారాయణరెడ్డి పాల్గొన్నారు.