వెంకటాపూర్, సెప్టెంబర్ 23 : రామప్ప ఉపాలయమైన గొల్లగుడిని, తూర్పు రోడ్డును ములుగు కలెక్టర్ టీఎస్ దివా కర సోమవారం పరిశీలించారు. గుడి పైకప్పు, దెబ్బతిన్న శిఖరం, పైకప్పులోని తామరపువ్వు గుర్తుతో ఉన్న ధ్వంస మైన శిల్పాన్ని పరిశీలించగా ఆలయ వివరాలను పురావస్తు శాఖ సీఏ మల్లేశం వివరించారు.
ధ్వంసమైన శిల్పం వివ రాలతో నివేదిక ఇవ్వాలని కేంద్ర పురావస్తు శాఖ అధికారిని ఆదేశించారు. అలాగే తూర్పు రోడ్డు అభివృద్ధి పనుల్లో వేగం పెంచి, ఏరియా మ్యాపింగ్ సర్వే చేసి, బౌండ్రీ ఫిల్లర్ వేసి హద్దులు ఏర్పాటుచేయాలని అధికారులకు చెప్పారు. ఇరిగే షన్ డీఈ రవిందర్, తహసీల్దార్ సదానందం, ఎంపీడీవో రాజు, ఆర్ఐ రమేశ్, కార్యదర్శి రేవతి పాల్గొన్నారు.
గొల్లగుడిని ధ్వంసం చేసిన నిందితులను త్వరలో పట్టుకుంటామని ఎస్సై జక్కలు సతీశ్ తెలిపారు. సోమవా రం ఆలయాన్ని, సీసీటీవీ ఫుటేజీనీ పరిశీలించామని, అనుమానితులను గుర్తించి విచారణ చేపడుతామన్నారు.