నల్లబెల్లి, జూన్ : నల్లబెల్లి డిప్యూటీ తహసీల్దార్ రాజేష్ కన్నా అనారోగ్య కారణాలతో సోమవారం తెల్ల వారుజామున మృతి చెందాడు. విషయం తెలుసుకున్న జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద హనుమ కొండలోని ప్రశాంత్ నగర్లోని మృతుడి ఇంటికి చేరుకొని పార్థీవ దేహంపై పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కాగా, రాజేష్ కన్నా గత నెల రోజులుగా అనారోగ్యానికి గురై హైదరాబాద్లోని విరించి దవాఖానాలో చికిత్స పొంది ఇటీవలే డిశ్చార్జి అయ్యారు.
అయితే మరో మారు అతని ఆరోగ్య పరిస్థితి విషమించడంతో కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం వరంగల్ ఎంజీఎంకు తరలించారు. చికిత్స పొందుతూ సోమవారం తెల్లవారుజామున రాజేష్ మృతి చెందాడు. డిప్యూటీ తహసీల్దార్ మరణ వార్త తెలుసుకున్న అదనపు కలెక్టర్ సంధ్యారాణి తో పాటు నల్లబెల్లి తహసీల్దార్ ముప్పు కృష్ణ, తదితరులు మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించారు.