నెక్కొండ మే 18: ధాన్యం కొనుగోలు ఓపిఎంఎస్ డేటా ఎంట్రీ వెంటవెంటనే పూర్తి చేసి ధాన్యం డబ్బులు రైతులకు త్వరితగతిన అందించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ సత్య శారద అధికారులను ఆదేశించారు. నెక్కొండ వ్యవసాయ మార్కెట్లో ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆదివారం కలెక్టర్ అధికారులతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రైస్ మిల్లులో ధాన్యం త్వరితగతిన అన్లోడ్ అయ్యేలా చర్యలు చేపట్టాలని డీఎంవోను ఆదేశించారు. కొనుగోలు కేంద్రం నిర్వాహకులు తాసిల్దార్ తో సమన్వయం చేసుకుంటూ హమాలీల సంఖ్యను పెంచుకొని త్వరగా ధాన్యాన్ని మిల్లులకు తరలించాలన్నారు.
వర్షాలు పడుతున్నప్పుడు రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, అందరూ చెప్పులు ధరించాలని ,చెట్ల కింద ఉండరాదని ధాన్యం తడవకుండా చూసుకోవాలని రైతులకు సూచించారు. కలెక్టర్ పర్యటనలో డీఈవో అనురాధ డీఎన్ఓ సురేఖ డి.ఎస్.జి.ఓ కిష్టయ్య, సివిల్ సప్లై డీఎం సంధ్యారాణి, ఏ డి ఆర్ డి ఓ రేణుకాదేవి, తాసిల్దార్ రాజ్ కుమార్, ఎంపీడీవో ప్రవీణ్ కుమార్, ఏవో నాగరాజు, ఏపిఎంలు శ్రీనివాస్, సుధాకర్, సిసి రవీందర్, ఏఈఓ వసంత, కొనుగోలు కేంద్రం ఇన్చార్జీలు సమత, సరిత, సతీష్ తోపాటు రైతులు హమాలీలు పాల్గొన్నారు.