వైద్యాధికారులతో కలెక్టర్ శశాంక
మహబూబాబాద్, జూలై 12: ప్రతివారం సమీక్ష నిర్వహిస్తూ సాధారణ ప్రసవాల సంఖ్యను పెంచాలని కలెక్టర్ శశాంక జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టర్ కార్యాలయంలో జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు.
గర్భిణులు ప్రైవేట్ వైద్యశాలలకు వెళ్తున్నారనే సమాచారం వస్తున్నదని, మండలాల్లోని వైద్యుల పనితీరును సమీక్షించాలన్నారు. గర్భిణులకు ఏఎన్సీ నమోదు సందర్భంలో సాధారణ ప్రసవం అయ్యేలా మోటివేషన్ చేయాలన్నారు. యోగా, ఫిజియోథెరపీపై అవగాహన కల్పించాలన్నారు. మండల, జిల్లా ప్రధాన దవాఖానల్లో సాధారణ ప్రసవాల వివరాలను అడిగి తెలుకున్నారు. సమీక్షలో ఏరియా దవాఖానల సూపరింటెండెంట్ వెంకట్ రాములు, జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి హరీశ్రాజ్, వైద్యులు ఉమాగౌరి, వెంకన్న, వైదేహి, మంజుల పాల్గొన్నారు.