హనుమకొండ చౌరస్తా, ఆగస్టు 28 : హనుమకొండలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియం(జేఎన్ఎస్)లో తాత్కాలిక స్పోర్ట్స్ స్కూల్ కం సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ ప్రారంభానికి 31లోగా అవసరమైన సదుపాయాలను కల్పించాలని గురువారం కలెక్టర్ స్నేహ శబరీష్ అధికారులను ఆదేశించారు. గురువారం ఆమె క్షేత్ర స్థాయిలో పర్యటించి వసతులను పరిశీలించారు. ఈ సందర్బంగా స్టేడియం ఆవరణలో ఉన్న హాస్టల్ భవనలు, ఔట్డోర్, క్రీడా మైదానాలను పరిశీలించి చేపట్టాల్సిన మరమ్మతులు, కల్పించాల్సిన సదుపాయాలను, విద్యార్థులకు క్రీడా సదుపాయాలు ఈనెల 31వ తేదీలోగా ఏర్పాట్లు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.
డీవైఎస్వో గుగులోతు అశోక్ కుమార్ను ప్రస్తుతం ఏర్పాటు చేసిన మౌలిక వస్తువుల గురించి వివరించారు. అలాగే జేఎన్ఎస్ ఆవరణలో విద్యార్థులకు హాస్టల్ వసతిలో ఉండాల్సిన సదుపాయల కల్పనకు, ఇండోర్, ఔట్డోర్ క్రీడా సదుపాయాలు, పరికరాల ఏర్పాటుకు, అవసరమైన మరమ్మతులను వెంటనే పూర్తి చేయాలని ఆయన సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అధికారులు సురేష్, నరేందర్రెడ్డి, కోచ్లు ఉన్నారు.