బిల్ట్ ఫ్యాక్టరీని పరిశీలించిన కలెక్టర్
మండలంలోని కమలాపురం బిల్ట్ ఫ్యాక్టరీని బుధవారం కలెక్టర్ ఇలా త్రిపాఠి సీనియర్ మేనేజర్ ప్రసాద్నాయర్తో కలిసి పరిశీలించారు. పరిశ్రమ లోపల స్థలంతో పాటు, కార్మికులు నివాసముండే కాలనీ, గోదావరి తీరంలోని ఇన్‌టేక్‌వెల్, ఫ్యాక్టరీ అనుబంధ పాఠశాల, సరిహద్దులను రెవెన్యూ, పంచాయతీ అధికారులను అడిగి తెలుసుకున్నారు.
మంగపేట, జనవరి 31 : మండలంలోని కమలాపురం బిల్ట్ ఫ్యాక్టరీని బుధవారం కలెక్టర్ ఇలా త్రిపాఠి సీనియర్ మేనేజర్ ప్రసాద్నాయర్తో కలిసి పరిశీలించారు. పరిశ్రమ లోపల స్థలంతో పాటు, కార్మికులు నివాసముండే కాలనీ, గోదావరి తీరంలోని ఇన్‌టేక్‌వెల్, ఫ్యాక్టరీ అనుబంధ పాఠశాల, సరిహద్దులను రెవెన్యూ, పంచాయతీ అధికారులను అడిగి తెలుసుకున్నారు. గతంలో చేసిన సర్వే నివేదికను పరిశీలిస్తూ ఫ్యాక్టరీకి సంబంధించి మొత్తం స్థలం ఎంత? సర్వే నంబర్ల వివరాలను తెలుసుకున్నారు. ఫ్యాక్టరీ మూతపడినప్పటికీ అసౌకర్యాల మధ్య నడుస్తున్న థాపర్ విద్యావిహార్ పాఠశాలను కలెక్టర్ పరిశీలించారు. ఆమె వెంట ఎస్సీ కార్పొరేషన్ ఈడీ తుల రవి, తహసీల్దార్ వీరస్వామి, ఎంపీడీవో ఆలేటి సుదర్శన్, డిప్యూటీ తహసీల్దార్ మల్లేశ్వర్రావు, ఆర్ఐ కుమారస్వామి ఉన్నారు.
పన్ను బకాయిలు చెల్లించాలి
కమలాపురం బిల్ట్ ఫ్యాక్టరీ, కార్మికుల కాలనీకి సంబంధించి పన్ను బకాయిలు చెల్లించాలని గ్రామ పంచాయతీ అధికారులు బుధవారం బిల్ట్ యాజమాన్యానికి నోటీసులు జారీ చేశారు. క్వార్టర్స్ పన్ను రూ. 85,84,507, ఫ్యాక్టరీ పన్ను రూ.1,50,59,992 కలిపి మొత్తం రూ. 2,36,44,499 సకాలంలో చెల్లించని పక్షంలో చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని నోటీసులో తెలిపారు.
Read Today's Latest Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
HCA | అక్రమాలు, అన్యాయాలకు కేరాఫ్ హెచ్‌సీఏ .. జీవన్‌రెడ్డి ఎలా సెక్రటరీ అయ్యాడు..? టీసీఏ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పెసరు విజయ్‌చందర్‌రెడ్డి
SA vs AUS | ఆసీస్ ఇన్నింగ్స్ డిక్లేర్.. భారీ ఛేదనలో సఫారీలకు హేజిల్‌వుడ్ షాక్..!
Plank Exercise | ప్లాంక్ వ్యాయామాన్ని అసలు ఎలా చేయాలి.. దీంతో కలిగే లాభాలేమిటి..?
Srivari Temple | ఖమ్మంలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి శ్రీకారం..పవిత్ర క్రతువును నిర్వహించిన త్రిదండి చిన్నజీయర్‌స్వామి
Srisailam Dam | శ్రీశైలం డ్యామ్‌కు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

