తెలంగాణ ఉద్యమంలో భాగంగా ప్రజా నేత కేసీఆర్‌తో ఓరుగల్లు ప్రత్యేక ముద్ర వేసుకున్నది. దీంతో ఉమ్మడి జిల్లాతో ఆయనకు విడదీయరాని అనుబంధం ఏర్పడింది. ఉద్యమ ఆశయాలు, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా సాగిన ప్రయాణంలో ఎన్నో అవరోధాలు, అవమానాలు ఎదురైనా.. ఎదురుదెబ్బలు తగిలినా తట్టుకొని ఆయన ముందుకు సాగడంలో వరంగల్ కీలక పాత్ర పోషించింది.
మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలంలోని ఖీమానాయక్ తండాలో కేసీఆర్ నిద్ర చేసి గిరిజనుల స్థితిగతులను తెలుసుకున్నారు. 2010లో వరంగల్‌లో భారీ బహిరంగ సభ నిర్వహణకు కూలి పనిచేశారు. ఈ సందర్భంగా ఓ జ్యువెల్లర్స్లో పనిచేసినఆయన అక్కడికి వచ్చిన యువతి పెళ్లికి నెక్లెస్ బహూకరించారు. సోమవారం బీఆర్ఎస్ అధినేత జన్మదినాన్ని పురస్కరించుకొని ఉమ్మడి జిల్లాలోని పలు జ్ఞాపకాలపై ప్రత్యేక కథనం..
– వరంగల్, ఫిబ్రవరి 16(నమస్తే తెలంగాణ ప్రతినిధి)/నెల్లికుదురు
2010 డిసెంబర్ 16న వరంగల్‌లోని ప్రకాశ్‌రెడ్డిపేటలో ఉద్యమ నేత కేసీఆర్ భారీ బహిరంగ సభకు అవసరమైన నిధు ల సమీకరణ కోసం కూలీ పని చేసే కార్యక్రమాన్ని చేపట్టారు. ఉమ్మడి జిల్లాలోని ఓ రైసుమిల్లులో కూలీగా, వరంగల్ నగ రంలోని సీపీరెడ్డి కాంప్లెక్స్‌లోని రెడిన్ కల ర్ ల్యాబ్ వర్కర్‌గా, చీర్స్ టైలర్స్‌లో టైలర్‌గా, మహమ్మద్ ఖాన్ జ్యువెలర్స్‌లో సే ల్స్మెన్గా పని చేశారు. ఈ క్రమంలో జ్యువెలరీ షాపునకు కరీంనగర్ జిల్లాకు చెందిన ఓ యువతి తల్లితో కలిసి వచ్చింది. కేసీఆర్ ‘ఏమిటమ్మా.. ఏం కొంటున్నా వు’ అని అడగడంతో పెండ్లికి నెక్లెస్ కొంటు న్నానని చెప్పింది. మరి ఎందుకు ముభావంగా ఉన్నావని అడగడంతో ఆ యువతి ఏమీ చెప్పలేదు.
‘నీ దగ్గరున్న నెక్లెస్ కంటే నా దగ్గరున్నది బాగుంది. ఇది తీసు కో అని’ కేసీఆర్ అన్నారు. అది ధర ఎక్కు వ సార్ అని యువతి అన్నది. ఆడపిల్ల పెండ్లి కోసం వారి కుటుంబసభ్యులు పడే ఇబ్బందులు బాగా తెలిసిన కేసీఆర్ పెద్ద మనసుతో స్పందించి, ‘నా దగ్గర ఉన్న నెక్లెస్ తీసుకోమ్మా. దీని పైస లు మొ త్తం నేనే ఇస్తా. నీ పెండ్లికి నా కా నుక ఇది’ అని యువతికి ఇచ్చారు. ఆ నెక్లెస్ ధర రూ.75 వేలు. ఆ మొత్తాన్ని కేసీఆర్ చెల్లించారు. జ్యువెలరీ షాపు నుంచి కేసీఆర్ బ యటికి వస్తుంటే.. ‘మీరు వచ్చిందే నిధు ల సమీకరణకు, ఇప్పుడు యువతికి నెక్లెస్ కొనిచ్చారు ఎందుకు అని’ జర్నలిస్టులు అడిగితే..‘ఆ పిల్ల నా బిడ్డ లెక్క అనిపించిందయ్యా. ఇచ్చిన’ అని తృప్తితో అక్కడి నుంచి ముందుకు సాగారు.
నాలుగున్నర కోట్ల ప్రజల ఆకాంక్షను నెరవేర్చాలని ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసి పడుతున్న తరుణంలో ఏప్రిల్ 7, 2008లో మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలంలోని ఖీమానా యక్ తండాలో గుగులోత్ లక్ష్మి-భోజ్యా ఇంట్లో బస చేశాడు. ఆ దంపతులతో కలిసి జొన్నరొట్టె లు తిని రాత్రి బస చేశాడు. ఉదయం వేకువజామునే పండ్లపుల్ల వేసుకుని తండాలోని గడపగడప తిరుగుతూ గిరిజనుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. పంటపొలాల పరిస్థితి ఏంటి.. సా గునీరు సక్రమంగా ఉందా..? తండాలో సౌకర్యాలు ఎలా ఉన్నాయి…? తదితర సమస్యలపై ఆరా తీశారు.
అక్కడే షేవింగ్ చేసుకుని, స్నానం చేశారు. ఈ క్రమంలో తండాకు చెందిన గుగులోత్ అంబలి-లింగా దంపతులు తమది నిరుపేద కుటుంబమని, బతుకుదెరువు కోసం హైదరా బాద్‌లో పనిచేసుకుంటున్నామని, తన కూతుళ్ల పెళ్లిళ్లు చేయడానికి ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నానని కేసీఆర్ వద్ద మొరపెట్టుకున్నారు. వెంటనే రూ. 1.50 లక్షల ఆర్థిక సాయం చేస్తానని ప్రకటించారు. కల్యాణలక్ష్మి పథకానికి ఈ రెండు ఘటనలు కూడా ఒక కారణమై ఉంటుందని బీఆర్ఎస్ వర్గాలు చెబుతుంటాయి. ఉద్యమ ప్రస్థానంలో జరిగిన ఘటనలతోనే కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక తెలంగాణలో ఎన్నో సంక్షేమ పథకాలు రూపుదిద్దుకున్నాయి.