నమస్తే తెలంగాణ నెట్వర్క్ ;జిల్లా అంతటా సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు కేక్ కట్ చేశారు. పలు ప్రాంతాల్లో అన్నదానం చేయడంతో పాటు దవాఖానల్లో పండ్లు అందజేశారు. పటాకులు కాల్చి మిఠాయిలు పంచి సంబురాలు చేసుకున్నారు. జననేత, రైతు బాంధవుడు, బడుగుల ప్రదాత చల్లగా ఉండాలని ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎమ్మెల్యే అరూరి రమేశ్, స్థానిక ప్రజాప్రతినిధులు వర్ధన్నపేటలోని అంబేద్కర్ సెంటర్లో కేక్ కట్ చేశారు. నర్సంపేట క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కేక్ కట్ చేసి అందరికీ పంచారు. గీసుగొండ మండలంలోని మొగలిచెర్ల గ్రామంలో ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ముఖ్యమంత్రి పుట్టిన రోజు వేడుకల్లో పాల్గొని కేక్ కట్ చేశారు.
ఉమ్మడి వరంగల్ అంతటా ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజు వేడుకలను శుక్రవారం బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, శ్రేణులు, అభిమానులు ఘనంగా జరుపుకొన్నారు. జనగామ బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో సీఎం కేసీఆర్ బర్త్‌డే సందర్భంగా పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య, బీఆర్ఎస్ పార్టీ జనగామ జిల్లా అధ్యక్షుడు పాగాల సంపత్‌రెడ్డి కేక్ చేసి సంబురాల్లో పాల్గొన్నారు. హనుమకొండ బాలసముద్రంలోని కేసీఆర్ పార్కులో చీఫ్ విప్ దాస్యం వినయ్‌భాస్కర్ మొక్కలు నాటారు. భద్రకాళి ఆలయంలో పూజలు చేశారు. హసన్‌పర్తిలోని ఎర్రగట్టుగుట్టలో బీఆర్ఎస్ వరంగల్ జిల్లా అధ్యక్షుడు, వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ కేక్ కట్ చేసి కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. పరకాలలోని శ్రీ భవాని కుంకుమేశ్వర ఆలయంలో ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ప్రత్యేక పూజలు చేసి క్యాంపు కార్యాలయంలో కేక్ కట్ చేశారు.
బస్టాండ్ ఆవరణలో అన్నదానం చేశారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాకేంద్రంలో ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు గండ్ర జ్యోతి హనుమాన్ దేవాలయంలో ప్రత్యేక పూజలు చేసి మున్సిపల్ కార్యాలయ ఆవరణలో మొక్కలు నాటి భారీ కేక్ కట్ చేశారు. అనంతరం రక్తదానం చేశారు. కాటారంలో జడ్పీ చైర్పర్సన్ జక్కు శ్రీహర్షిణి పాల్గొన్నారు. కాళేశ్వరంలో వీఐపీ ఘాట్ వద్ద కాటారం పీఏసీఎస్ చైర్మన్ చల్లా నారాయణరెడ్డి దంపతులు మృత్యుంజయ హోమం నిర్వహించారు. వరంగల్ జిల్లా నర్సంపేటలో ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి, గీసుగొండలో ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, ఆజంజాహి మిల్స్ గ్రౌండ్లో జరిగిన సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకల్లో ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ పాల్గొన్నారు. మహబూబాబాద్ జిల్లాకేంద్రంలో పలుచోట్ల ఎమ్మెల్యే బానోత్ శంకర్‌నాయక్ పాల్గొని కేక్ కట్ చేసి అన్నదానంతో పాటు వృద్ధులకు దుప్పట్లు పంపిణీచేశారు. అలాగే ఎన్టీఆర్ స్టేడియంలో క్రికెట్ పోటీలను ప్రారంభించారు. ఎమ్మెల్సీ క్యాంపు కార్యాయలంలో ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్రావు కేక్ కట్ చేశారు. కురవిలో డోర్నకల్ ఎమ్మెల్యే డీఎస్ రెడ్యానాయక్ కేక్ కట్ చేసి సంబురాల్లో పాల్గొన్నారు.
వరంగల్ నగరంలో జననేత ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టిన రోజు వేడుకలను ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు, అభిమానులు ఘనంగా నిర్వహించారు. 37వ డివిజన్ ఖిలావరంగల్‌లో సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలను కార్పొరేటర్ వేల్పుగొండ సువర్ణ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి పండ్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో టీఆర్ఎస్కేవీ జిల్లా అధ్యక్షుడు బోగి సురేశ్, డివిజన్ అధ్యక్షుడు సంగరబోయిన విజయ్, యూత్ అధ్యక్షుడు నలిగంటి అభిషేక్, తీగల శ్రీధర్, నలిగంటి నవీన్ పాల్గొన్నారు. అలాగే, 38వ డివిజన్ పడమరకోటలోని అమరవీరుల స్తూపం వద్ద సీఎం జన్మదిన వేడుకలు కార్పొరేటర్ బైరబోయిన ఉమ ఆధ్వర్యంలో జరిగాయి. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ బైరబోయిన దామోదర్‌యాదవ్, బీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు మిట్టపల్లి కట్టమల్లు, ఖిలావరంగల్ పీఏసీఎస్ డైరెక్టర్ తోటకూరి నర్సయ్య, బీఆర్ఎస్ నాయకులు రావుల రాజేశ్, బొల్లం కార్తీక్, కొత్తపెల్లి శ్రీనివాస్, అనుమాసు సత్యం, ధర్మపురి ఓంప్రకాశ్, వంగ దయాకర్, ముప్ప మధు, పోశాల రవి, నలిగంటి ప్రేమ్‌సాగర్, సులగం అశోక్, శ్రీపతి వాణి పాల్గొన్నారు.
దేశం చూపు కేసీఆర్ వైపు..
ఉద్యమనేతగా తెలంగాణ రాష్ర్టాన్ని సాధించి, ముఖ్యమంత్రిగా రాష్ర్టాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్న కేసీఆర్ వైపు దేశం, ఇతర రాష్ర్టాల ముఖ్యమంత్రులు చూస్తున్నారని కార్పొరేటర్లు, నాయకులు అన్నారు. వరంగల్ 32, 39, 40, 41, 42, 43 డివిజన్లలో సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా అన్నదాన కార్యక్రమాలు, యాగాలు చేశారు. కార్పొరేటర్లు పల్లం పద్మ, సిద్దం రాజు, రవి, పోశాల పద్మ, గుండు చందన, అరుణ కేక్ కట్ చేశారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు పల్లం రవి, నాగపురి కల్పన డివిజన్ అధ్యక్షుడు పొగాకు సందీప్, నాయకులు వెలిదె శిమూర్తి, నాగపురి సంజయ్‌బాబు పాల్గొన్నారు. తవక్కల్ వెల్ఫేర్ ట్రస్టు చైర్మన్ ఎంఏ జబ్బార్ ఆధ్వర్యంలో మైనార్టీలు సంబురాలు జరిపారు. కార్యక్రమంలో మసన్ అలీబేగ్, అంజత్, దస్తగిరి పాల్గొన్నారు. మంకీఫుడ్కోర్టులో ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ మొక్కలు నాటారు. కార్యక్రమంలో కోరె కృష్ణ, ఎలగొండ రవి, ఆవునూరి రామన్న, వంగరి సురేశ్ పాల్గొన్నారు. 42వ డివిజన్లో మాజీ కార్పొరేటర్ కేడల పద్మ కేక్ కట్ చేశారు. కార్యక్రమంలో కర్ర కుమార్, పాల రంజిత్, కత్తి ఎల్లాగౌడ్, బొమ్మగాని కుమారస్వామి పాల్గొన్నారు.
కాశీలో కేసీఆర్ జన్మదిన వేడుకలు
సీఎం కేసీఆర్ పుట్టిన రోజును పురస్కరించుకొని తెలంగాణ ఉద్యమకారుడు, బీఆర్ఎస్ ఎస్టీసెల్ నాయకుడు భూక్యా మోతీలాల్‌నాయక్ ఆధ్వర్యంలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని కాశీలో శుక్రవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెల్లవారుజామున కాశీలోని పరమశివుడికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేశారు. అనంతరం కేక్ కట్ చేసి భక్తులకు స్వీట్లు, పండ్లు పంపిణీ చేశారు.
కాశీవిశ్వేశ్వరంగనాథస్వామి ఆలయంలో..
కాశీబుగ్గలోని శ్రీకాశీవిశ్వేశ్వరంగనాథస్వామి ఆలయంలో శివుడికి ప్రత్యేక పూజలు, పాలాభిషేకం చేశారు. అనంతరం ఆలయం ఎదుట కేసీఆర్ బర్త్‌డే వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ గుండేటి నరేంద్రకుమార్, మాజీ కార్పొరేటర్ బయ్యాస్వామి కేక్ కట్ చేసి స్వీట్లు పంచి, పేదలకు అన్నదానం చేశారు. 3వ డివిజన్ ఆరెపల్లి జంక్షన్లో కార్పొరేటర్ జన్ను షీభారాణి-అనిల్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి స్వీట్లు, పండ్లు అందించారు. పటాకులు కాల్చి సంబురాలు నిర్వహించారు. కార్యక్రమంలో హనుమకొండ పీఏసీఎస్ చైర్మన్ ఇట్యాల హరికృష్ణ, డివిజన్ అధ్యక్షుడు నేరెళ్ల రాజు, నాయకులు ఎం కుమార్‌యాదవ్, ఇట్యాల శిరీష, పండుగ రవీందర్‌రెడ్డి, ఆదాం, శీర్ల రవీందర్, బొచ్చు రాజు, బుద్ద వెంకన్న, శ్రీనన్న, బోనాల సల్మాన్, రమేశ్పాల్, యాకూబ్, గౌని కిశోర్, రబ్బాని, కందగట్ల మోహన్, ఇట్యాల శ్రీనివాస్, నాగరాజు, జన్ను స్వామిదాస్, లింగం కోటి, కుమార్, రాంబాబు, ఈసంపెల్లి సంజీవ, రవీందర్, బిజిలి రాజా, మంగ నరసయ్య, సింగారపు కుమార్, సాయి, ప్రతాప్, రవి, సురేశ్, నాగుల రంజిత్, చిలక రాజు, జున్న భాస్కర్, రాజు పాల్గొన్నారు.
వినూత్నంగా సీఎం పుట్టిన రోజు వేడుకలు
సీఎం పుట్టిన రోజు వేడుకలను బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు, శాప్ మాజీ డైరెక్టర్ రాజనాల శ్రీహరి వినూత్నంగా నిర్వహించారు. వరంగల్చౌరస్తాలో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలతో రూపొందించిన క్యాలెండర్లు, మహిళలకు రూ. 116 నగదు, పండ్లు, పురుషులకు టవల్స్ అందజేశారు. 23వ డివిజన్ గోపాలస్వామిగుడి జంక్షన్లో మాజీ కార్పొరేటర్ యెలుగం లీలావతి సత్యనారాయణ ఆధ్వర్యంలో తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ మహిళలకు చీరెలు పంపిణీ చేశారు. కొత్తవాడలో మాజీ కార్పొరేటర్ యెలుగం శ్రీనివాస్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి, మిఠాయి పంపిణీ చేశారు. పేదలకు దుస్తులు పంపిణీ చేయడంతోపాటు బీఆర్ఎస్ సీనియర్ కార్యకర్త బూర రవికి కొత్త సైకిల్‌ను బహూకరించారు. మాస్టర్ హోటల్ వద్ద బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు నీలం రాజ్‌కిశోర్ ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో ఎనుమాముల మార్కెట్ కమిటీ చైర్పర్సన్ దిడ్డి భాగ్యలక్ష్మి, కార్పొరేటర్ దిడ్డి కుమారస్వామి పాల్గొన్నారు. ఆటోనగర్‌లోని లూయీస్ ఆదర్శ అంధుల పాఠశాలలో 22వ డివిజన్ బీఆర్ఎస్ ఇన్చార్జి మావురపు గీతా విజయభాస్కర్‌రెడ్డి ఆధ్వర్యంలో విద్యార్థులకు అన్నదానం చేశారు.
13వ డివిజన్ దేశాయిపేటలోని సీకేఎం కళాశాల ఆవరణలో కార్పొరేటర్ సురేష్‌కుమార్ జోషి ఆధ్వర్యంలో 10 కిలోల కేక్ కట్ చేశారు. 12వ డివిజన్ కార్పొరేటర్ కావటి కవితా రాజు యాదవ్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేశారు. 33వ డివిజన్లో కార్పొరేటర్ ముష్కమల్ల అరుణ భారీ కేక్ కట్ చేసి, అన్నదానం చేశారు. 25వ డివిజన్ కార్పొరేటర్ బస్వరాజు శిరీషా-శ్రీమాన్ దంపతులు శివసాయి మందిరంలో సీఎం కేసీఆర్ పేరున ప్రత్యేక అర్చనలు, పూజలు చేశారు. ఈ సందర్భంగా స్థానికులకు పండ్లు పంపణీ చేశారు. 26వ డివిజన్లో బాలిన సురేశ్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నేత ముష్కమల్ల సుధాకర్ పాల్గొన్నారు.
కేక్ కట్ చేసిన డిప్యూటీ మేయర్
ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలను 36, 27వ డివిజన్ల పరిధిలో ఘనంగా నిర్వహించారు. 36వ డివిజన్ పరిధిలోని డివిజన్ కమిటీ కార్యాలయ ఆవరణలో డిప్యూటీ మేయర్ రిజ్వానా షమీమ్ మసూద్ కేక్ కట్ చేశారు. అనంతరం పేద మహిళలకు చీరెలు పంపిణీ చేశారు. 27వ డివిజన్ పరిధిలోని అజాంజాహి మిల్స్ గ్రౌండ్లో తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ ఆధ్వర్యంలో మూడో రోజు వేడుకల్లో భాగంగా ఆర్యవైశ్య మిత్ర బృందం అధ్యక్షుడు దుబ్బ శ్రీనివాస్ కేక్ కట్ చేసి వేడుకలు నిర్వహించారు. ఉద్యమకారుల సంఘం తూర్పు నియోజకవర్గ విభాగం కన్వీనర్ గడ్డం యుగేంధర్ ఆధ్వర్యంలో ఎంజీఎం బ్లడ్ బ్యాంకులో రక్తదాన శిబిరం నిర్వహించారు. కార్యక్రమాలలో జిల్లా మైనారిటీ నాయకులు మసూద్, పసునూరి బాలకృష్ణ, రాగి నాగేశ్వర్రావు, రాజ్‌కుమార్, హెడ్ నర్సు కమల, బల్డ్ బ్యాంక్ మోటివేటర్ కల్యాణి, సిబ్బంది పాల్గొన్నారు.