ఎన్నికల సమయంలో ఇచ్చిన మాట నిలబెట్టుకున్న సీఎం కేసీఆర్ రైతుల పాలిట ఆపద్బాంధవుడిలా నిలిచారు. కరోనాసమయంలో రాష్ర్టా నికి ఇవ్వాల్సిన నిధుల్లో కేంద్రం కోత విధించినా మాటకు కట్టుబడిన ముఖ్య మంత్రి రైతుల రుణం మాఫీ చేస్తూ ఆదేశాలిచ్చారు. కేసీఆర్ ప్రకటనతో జయశంకర్ భూపా లపల్లి జిల్లాలో లక్ష రూపాయల లోపు రుణం తీసుకున్న 50,437 మంది రైతులకు లబ్ధి చేకూరింది. రూ.373.17కోట్లు మాఫీ చేస్తూ ఉత్తర్వులు జారీ అవడంతో అన్నదా తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రైతుబంధు, రైతుబీమా, నిరంతరం ఉచిత విద్యుత్ ఇస్తూ రైతులకు అండగా నిలవడంతో పాటు రెండోసారి రుణమాఫీ చేసిన కేసీఆర్‌కు జనం జేజేలు పలుకుతున్నారు.
-భూపాలపల్లిటౌన్, ఆగస్టు 25
సీఎం కేసీఆర్ సార్ ఇచ్చిన మాట ప్రకారం పంట రుణం మాఫీ చేశారు. మాట ఇస్తే తప్పడు అనే విషయం మరోమారు నిరూపించుకున్నడు. రైతు పక్షపాతి, రైతుల కోసం ఎన్నో పథకాలు అమలు చేస్తూ అండగా నిలుస్తున్నారు. పంట రుణాలు ఇంకెప్పుడు మాఫీ అయితయ్.., ఎన్నికలు వత్తానయక్ అని ప్రతిపక్షాలు భయపెట్టాయి. గతంలో ఏ ప్రభుత్వాలు రైతుల కోసం ఇంతగా పట్టించుకోలేదు. సీఎం కేసీఆర్ సార్నే మళ్ల గెలిపించుకుంటం.
-దుండ్ర మల్లేశ్, రైతు, గొర్లవీడు
భూపాలపల్లిటౌన్, ఆగస్టు 25 : ఇచ్చిన మాట ప్రకారం సీఎం కేసీఆర్ రైతులు తీసుకున్న పంట రుణాలు మాఫీ కావడంతో జిల్లాలో ఆనందం వెల్లి విరుస్తోంది. కరోనా సమయంలో కేంద్రం రాష్ర్టానికి ఇవ్వాల్సిన నిధుల్లో కోత విధించినా, కక్షపూరిత ధోరణితో వ్యవహరించి ఆర్థిక ఇబ్బందులకు గురిచేసినా మాటకు కట్టుబడిన సీఎం కేసీఆర్ రుణమాఫీ చేస్తూ అధికారులకు ఆదేశాలిచ్చాడు. సీఎం ఆదేశాలతో కదిలిన అధికార యంత్రాంగం రూ.లక్ష లోపు రుణం తీసుకున్న రైతుల డబ్బులను మాఫీ చేస్తుండగా, ఆ ప్రక్రియ చివరి దశకు చేరింది. ఆదేశాలిచ్చిన నెలలోనే అధికారులు ప్రక్రియను వేగవం తం చేశారు. దీంతో అన్నదాతలు ఆనందంగా సాగు చేసుకుం టున్నా రు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా లో 50,437 మంది రైతులు రూ. లక్షలోపు పంట రుణాలు తీసుకోగా ఆ మొత్తం రూ.373.17 కోట్లు మాఫీ అయ్యింది. రైతు సంక్షేమానికి అధిక ప్రాధాన్యతనిస్తున్న బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారం లోకి వచ్చిన ఏడాదిలోనే రైతు ప్రభుత్వంగా పేరు తెచ్చుకున్నది. తొమ్మిదేళ్ల పాలనలో రైతుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ఎన్నో సంక్షేమ పథకాలను ప్రారంభించి అమలు చేస్తున్నది. 24గంటల ఉచిత విద్యుత్‌తో పాటు రైతుబంధు, రైతుబీమా పథకాలతో పాటు రూ.లక్ష రుణమాఫీ చేయడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రెండో విడుత రూ.లక్ష రుణమాఫీ చేయ డంతో రైతుల సంబురంగా సాగు పనుల్లో నిమగ్నమయ్యారు.
ఇచ్చిన మాట ప్రకారం ప్రభుత్వం పంట రుణాలు మాఫీ చేయడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఇక పంట రుణాలు మాఫీ చేయరేమో అని ఆందోళన చెందిన రైతులకు ఊరట లభించింది. ప్రతిపక్షాలు సైతం పంట రుణాలు మాఫీ చేసే పరిస్థితిలో ప్రభుత్వం లేదని హేళన చేశాయి. వారి అంచనాలను తారుమారు చేస్తూ.. విమర్శలను తిప్పి కొడుతూ సీఎం కేసీఆర్ రుణమాఫీని ప్రకటించి విజయవంతంగా ప్రక్రియను పూర్తి చేశారు. రుణం మాఫీకావడంతో రైతులు వానాకాలం సాగుకు శ్రీకారం చుట్టారు.
ప్రభుత్వం రూ.లక్ష లోపు పంట రుణాలను మాఫీ చేయడంతో జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని 50,437 మంది రైతులకు చెందిన రూ. 373.17 కోట్లు మాఫీ అయ్యాయి. భూపాలపల్లి మండలంలో 7,027 మంది రైతులకు రూ.51, 91, 58, 131.8, చిట్యాలలో 1,981 మందికి రూ.16,39,40,706.4, గణపురంలో 6,067 మందికి రూ.46,37,22,389.7, రేగొండలో 5,702 మందికి రూ.42,82, 93,783.6, మొగుళ్లపల్లిలో 3,780 మందికి రూ.33,43,39, 728. 7, టేకుమట్లలో 3,658 మందికి రూ.26,51,41, 788, కాటారంలో 9,738 మందికి రూ.63,00, 59,009, మహాదేవ్‌పూర్‌లో 5,774 మందికి రూ.46,80,60,632.9, మల్హర్‌లో 2,227 మం దికి రూ.14,70,36,885, మహాముత్తారంలో 4,483 మందికి రూ.31, 17,05,784 కోట్ల పం ట రుణం మాఫీ అయ్యింది.