పోచమ్మమైదాన్, అక్టోబర్ 29 : వారంటీలు లేని గ్యారంటీలు మనకొద్దని, సీఎం కేసీఆర్ సార్ సంక్షేమ పథకాలే ముద్దని బీఆర్ఎస్ పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షుడు, వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ అన్నారు. గ్రేటర్ 14వ డివిజన్ సాయి గణేశ్ కాలనీకి చెందిన మహిళలతోపాటు ఎస్సార్ నగర్‌కు చెందిన యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు ఆదివారం బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అరూరి వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులైన మహిళలు, ఇతర పార్టీల కార్యకర్తలు బీఆర్ఎస్లో చేరుతున్నారన్నారు. ప్రతి కార్యకర్తకు పార్టీ అండగా ఉంటూ, వారిని కడుపులో పెట్టుకుని కాపాడుకుంటుందని తెలిపారు. అందరూ కలిసికట్టుగా పార్టీ బలోపేతానికి కృషి చేయాలని కోరారు. సీఎం కేసీఆర్ మ్యానిఫెస్టోను గడపగడపకూ తీసుకవెళ్లి ప్రచారం చేయాలని పిలుపునిచ్చారు. పార్టీలో చేరిన వారిలో భూసా మహేశ్, సుజాత, విజయ, భూలక్ష్మి, విష్ణువర్ధన్, ఆడెపు నాగరాజు, రంజిత్, రాజు, శివ, వెంకట్, దేవేంద్రాచారి, దేవిక, రోజా, భాగ్యలక్ష్మి, సునీత, రమ్య, చందనాల శివకుమార్, లావణ్య, రవికుమార్, సుప్రీమ్, గోవర్ధన్, ధర్మ, శ్రీనివాస్, రాజ్యలక్ష్మి, నిఖిల, ప్రవీణ్, సురేందర్, నవ్యశ్రీ ఉన్నారు. కార్యక్రమంలో జిల్లా రైతు బంధు సమితి అధ్యక్షురాలు ఎల్లావుల లలితా యాదవ్, కార్పొరేటర్ తూర్పాటి సులోచనా సారయ్య, డివిజన్ అధ్యక్షుడు ముడుసు నరసింహ, నాయకులు కేతిరి రాజశేఖర్, గండ్రాతి భాస్కర్, దుబ్బ శ్రీను, రామ్మూర్తి, మహిళా అధ్యక్షురాలు మాధవి, మోటే చిరంజీవి, గోపాల్, రంగం విజయ, మల్లయ్య పాల్గొన్నారు.
నయీంనగర్ : వర్ధన్నపేట మున్సిపాలిటీ పరిధిలోని 4వ డివిజన్ వార్డు స్వామి తండాకు చెందిన పలువురు నాయకులు హనుమకొండ ప్రశాంత్‌నగర్‌లోని ఎమ్మెల్యే అరూరి రమేశ్ నివాసంలో బీఆర్ఎస్లో చేరారు. వారికి ఎమ్మెల్యే పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా అరూరి రమేశ్ మాట్లాడుతూ ఎన్నికల సందర్భంగా సీఎం కేసీఆర్ మ్యానిఫెస్టోకి పలువురు ఆకర్షితులై పార్టీలో చేరడం చాలా సంతోషంగా ఉందన్నారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ స్వామిరాయుడు, కట్య్రాల సర్పంచ్ సంపత్‌రెడ్డి, మాజీ ఎంపీటీసీ వసంత్‌నాయక్, వీరన్న, రాజ్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.