రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు మానుకోట జిల్లా పర్యటన ఖరారైంది. ఈ నెల 12న ఉదయం హైదరాబాద్ నుంచి హెలికాప్టర్లో జిల్లా కేంద్రానికి చేరుకుంటారు. సాలార్‌తండా వద్ద రూ.52కోట్లతో నిర్మించిన కొత్త సమీకృత కలెక్టరేట్‌తో పాటు ఎస్పీ కార్యాలయం సమీపంలో నిర్మించిన మెడికల్ ప్రారంభించనున్నారు. అంనతరం గిరిజన భవన్ పక్కన నిర్మించిన బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని సైతం ప్రారంభించనున్నారు. అనంతరం జిల్లాకేంద్రం నుంచి హెలికాప్టర్లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు వెళ్లనున్నారు. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో ఆదివారం రాత్రి కలెక్టర్ శశాంక, ఎస్పీ శరత్చంద్ర పవార్ అధికారులతో సమీక్షించారు.
– మహబూబాబాద్, జనవరి (నమస్తే తెలంగాణ)