పాలకుర్తి/దేవరుప్పుల/కొడకండ్ల, నవంబ ర్13: బీఆర్ఎస్ పార్టీతోనే అభివృద్ధి, సంక్షేమ మని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి, బీఆర్ ఎస్ పాలకుర్తి అభ్యర్థి ఎర్రబెల్లి దయాకర్‌రావు అ న్నారు. సోమవారం పాలకుర్తి, దేవరుప్పుల, కొడ కండ్ల బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాల్లో ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు మాట్లాడుతూ పాలకుర్తి నియోజకవర్గంలోని తొ ర్రూరులో మంగళవారం నిర్వహించే సీఎం కేసీఆ ర్ ప్రజా ఆశీర్వదాద సభకు భారీ సంఖ్యలో తరలి వచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ గెలుపు సల్లే రుపై నడకేనని అన్నారు. తాను కోట్లాది రూపా యల నిధులతో అనేక అభివృద్ధి సంక్షేమ పథకా లను పేద ప్రజలకు అందించానన్నారు. ఇప్పటికే నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేశా మని, రాబోయే రోజుల్లో మరింత అభివృద్ధి చేయాలన్నదే తన ధ్యేయమని తెలిపారు. ఇప్పటి వరకు తాను చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్ర మాలను వివరించారు. భారీ మెజార్టీతో నాయకు లు, కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేయాలని పిలు పునిచ్చారు. కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే రాష్ట్రంలో మళ్లీ చీకట్లేనన్నారు. తొర్రూరులో మంగళవారం జరిగే కేసీఆర్ సభకు ఊర్లకు ఊర్లు తరలిరావాలని ఎర్రబెల్లి పిలుపునిచ్చారు. ప్రతిపక్షాలకు ఓటడిగే హక్కు లేదని, వారిని జనం పట్టించుకోవడం లేద న్నారు. ఇక పాలకుర్తిలో అమెరికా పైసలు రాజ్య మేలుతున్నాయని, వాటికి ఆశపడ్డ కొందరు నా యకులు అటు పోతున్నారని, వారికి పట్టించుకో వాల్సిన అవసరం లేదన్నారు. తన గెలుపు కోసం కార్యకర్తలు అహర్నిశలు కృషి చేయాలన్నారు.
కేసీఆర్ చేసిన అభివృద్ధి, సంక్షేమాన్ని చూసి ఓటు వేసి ఆశీర్వదించాలని మంత్రి దయాకర్రా వు అన్నారు. నేడు తొర్రూరులో లక్ష మంది తో భారీ బహిరంగ సభను నిర్వహిస్తున్నట్టు తెలి పా రు. దళిత, గిరిజన, బీసీ బంధు వంటి పథకాల ను సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టారని, కాళేశ్వరం నీటి తో తెలంగాణను సస్యశ్యామలం చేశాడని, ఎన్నో పథకాలు తెచ్చి తెలంగాణ ప్రజలను సుభిక్షంగా ఉంచిన కేసీఆర్‌ను గెలిపించాలని అన్నారు. ఇవ్వా ళ ఇక్కడ, రేపు ఎక్కడో తెలియని వాళ్లకు ఓటు వేద్దా మా, మీ కష్టసుఖాల్లో పంచుకుంటున్న నాలాంటి వాడికి ఓటు వేస్తారా ప్రజలు తేల్చుకో వాలని చెప్పారు. కాంగ్రెస్‌ను నమ్మితే ఆగమే అని, కరెంటు, నీటి కష్టాలు తప్పవని ప్రజలు గుర్తించా లన్నారు. పాలకుర్తి నియోజకవర్గ ప్రజలను అవ మానించిన కాంగ్రెస్‌ను పాతర పెడదామని, దళి తులను కాలుతో తన్నిన రేవంత్‌కు, తలదన్నే లా జవాబు చెబుదామని, ఆ పార్టీని ఓడించి, ఆ అ హంకారాన్ని అణచివేద్దామని ఎర్రబెల్లి అన్నారు.
మంత్రి దయాకర్‌రావును భారీ మెజార్టీతో గెలిపిస్తామని, ఆయనకు తమ పూర్తి మద్దతు ఇస్తు న్నట్లు గుడికుంట తండావాసులు తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ కార్యా లయంలో మంత్రి ఎర్రబెల్లి ని కలిశారు. వారికి గులాబీ కండువులు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అదేవిధంగా మల్లంపెల్లి నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్లోచేరారు.
కొడకండ్ల మండలం నర్సింగాపురం గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు ముత్యం మధు, జీబీ తండా గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ 4వ వార్డు సభ్యుడు గుగులోత్ రామ్ చంద ర్, నాయకులు వీరన్న హనుమంతు, సురేశ్, యా కేశ్, రాకేశ్ మంత్రి సమక్షంలో పార్టీలో చేరారు.