మహబూబాబాద్, జూన్ 25 (నమస్తే తెలంగాణ) : మహబూబాబాద్ 4వ వార్డు గాంధీపురానికి చెందిన బానోత్ మాలుకు తమ్ముడు, బాలాజీనాయక్, చెల్లెళ్లు జ్యోతి, లీల ఉన్నారు. ఎకరం భూమిలో వ్యవసాయం, ఇతర కూలీ పనులు చేస్తూనే కుటుంబాన్ని పోషిస్తున్నాడు. మాలు తల్లిదండ్రులు బిచ్చా-చిల్కితో పాటు మాలు-బుజ్జి దంపతులు కూలీ పనిచేస్తూ బాలాజీనాయక్, లీలను బాగా చదివించారు. బాలాజీనాయక్ ఎంసీఏ, లీలను బీఈడీ కోర్సు చదివించారు. బాలాజీ నాయక్ ఇంటర్ వరకు మహబూబాబాద్, డిగ్రీ హనుమకొండలో చదివాడు. ఆ తర్వాత ఎంసీఏ కోసం హనుమకొండలోని చైతన్య పీజీ కళాశాలలో చేరాడు. కోర్సు చివరి సంవత్సరం చదువుతున్న సమయంలో తెలంగాణ మలిదశ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసింది. మొదటినుంచి తెలంగాణ అంటే అమితమైన అభిమానమున్న బాలాజీనాయక్ కళాశాలలోని తోటి విద్యార్థులతో కలిసి అనేక ఉద్యమాల్లో పాల్గొన్నాడు. అలాగే గాంధీపురం, అనంతారం, బయ్యారం, మహబూబాబాద్‌లో ఉద్యమ కార్యక్రమాల్లో పాల్గొనేవాడు. తెలంగాణ కోసం ఎక్కడ సమావేశాలు పెట్టినా, ధూంధాం, ధర్నాలు, రాస్తారోకోలు, మానవహారాలు జరిగినా దోస్తులతో కలిసి ఉత్సాహంగా పాల్గొనేవాడు. బాలాజీ నాయక్ చదువులో ఎప్పుడూ చురుగ్గా ఉండేవాడు. తెలంగాణ మలిదశ ఉద్యమంలో ఎంతో ఉత్సాహంగా పాల్గొనేవాడు.
సమైక్య నాయకులంతా కలిసి తెలంగాణ రాకుండా చేస్తున్నారని, తన బలిదానంతోనైనా ప్రత్యేక రాష్ట్రం ఏర్పడుతుందని భావించాడు. 2010 జనవరి 27న మహబూబాబాద్ మండలం అనంతారం రైల్వేగేట్ సమీపంలో వేగంగా వస్తున్న కేరళ ఎక్స్‌ప్రెస్‌కు జై తెలంగాణ అంటూ ఎదురెళ్లి ప్రాణాలు విడిచాడు. అయితే తెలంగాణ కోసం ప్రాణాలు అర్పించిన బాలాజీనాయక్ త్యాగాన్ని బీఆర్ఎస్ సర్కారు గుర్తించింది. 2014 ఎన్నికల ముందు చెప్పినట్టే సీఎం కేసీఆర్ సార్ మా కుటుంబానికి రూ.10లక్షలు ఇవ్వడంతో పాటు బీఈడీ చేసిన చిన్న చెల్లెలు లీలకు కేసముద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జూనియర్ అసిస్టెంట్‌గా ఉద్యోగం ఇచ్చింది. మాలు తల్లి చిల్కి 2022 జనవరిలో గుండెపోటుతో మరణించగా, తండ్రి బిచ్చా 2022 ఆగస్టులో మరణించాడు. ఆరు నెలల వ్యవధిలోనే తల్లిదండ్రులిద్దరు గుండెపోటుతో మరణించడం మాలు మరింత కుంగిపోయాడు. ఉద్యమ సమయంలో ఊరికి వచ్చిన నాయకులను బాలాజీనాయక్ ఇంటికి తీసుకొచ్చి మంచినీళ్లు, చాయ్ తాగించిన తర్వాతే పంపేటోడని వారు గుర్తు చేసుకున్నారు. రాష్ట్రం వచ్చింది కానీ తమ్ముడు లేడనే బాధ ఉందని అమరుడు బాలజీనాయక్ అన్నావదినలు మాలు-బుజ్జి ఆవేదనతో చెప్పారు.
మా అన్నయ్య బాలాజీనాయక్ తెలంగాణ కోసం రైలుకెదురెళ్లి అమరుడయ్యాడు. కేసీఆర్ సార్ సీఎం అయిన తర్వాత మా కుటుంబానికి రూ.10లక్షల నగదుతో పాటు నాకు జూనియర్ అసిస్టెంట్‌గా ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చారు. అన్నయ్య లేని లోటు తీర్చలేనిది. ప్రభుత్వం ఆదుకోకుంటే మా కుటుంబం రోడ్డున పడేది. ఇప్పుడు మా కుటుంబ ఆర్థిక పరిస్థితి మెరుగుపడింది. సమైక్య రాష్ట్రంలో వెనుకబడ్డ తెలంగాణ ప్రస్తుతం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందింది. ఇది సీఎం కేసీఆర్ సార్ వల్లే సాధ్యమైంది. తెలంగాణ వచ్చిన తర్వాత అన్ని వర్గాల వారికి ప్రాధాన్యం ఇస్తున్నారు.
-లీల, జూనియర్ అసిస్టెంట్, కేసముద్రం
తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత సీఎం కేసీఆర్ సార్ మా కుటుంబానికి రూ.10లక్షలు, చిన్న చెల్లెలు లీలకు సర్కారు నౌకరి ఇచ్చారు. రూ.5లక్షలు అప్పుతీర్చాం. మిగిలిన రూ.5లక్షలతో ఇద్దరు చెల్లెళ్ల పెళ్లిళ్లు చేశాం. చాలా సంతోషంగా ఉంది. కేసీఆర్ సార్ ఆదుకోకుంటే భూమి అమ్ముకోవాల్సి వచ్చేది. మిత్తి, అసలుతో పాటు చెల్లెల పెళ్లిళ్ల కోసం ఆగమయ్యేది. ఇప్పుడు భూమికి ఎంతో డిమాండ్ వచ్చింది. తమ్ముడు లేడన్న బాధలో ఉన్న మా కుటుంబానికి సీఎం కేసీఆర్ అండగా నిలిచిండు. ప్రభు త్వ ఉద్యోగం కూడా ఇచ్చిండు. ఆయనకు జీవితాంతం రుణపడి ఉంటాం. తెలంగాణ వచ్చిన తర్వాత రైతులకు 24గంటల కరంట్, రైతుబంధు, రైతుబీమా పథకాలు ప్రవేశపెట్టాడు. ఒకప్పుడు డివిజన్ కేంద్రంగా ఉన్న మానుకోటను జిల్లా చేసిండు. కొత్తగా కలెక్టరేట్, మెడిక ల్ కాలేజీ వచ్చింది. మా ఊరిని మహబూబా బాద్ మున్సిపాలిటీలో కలిపి, డ్రైనేజీలు, ము రుగు కాల్వలు, మిషన్ భగీరథ నీళ్లు ఇస్తున్నరు.
– మాలు-బుజ్జీ, అమరుడు బాలాజీనాయక్ అన్నావదినలు