‘ఇల్లెందు నియోజకవర్గం ఉద్యమాల పురిటిగడ్డ.. ఇక్కడి నుంచి బీఆర్ఎస్ తరఫున పోటీ చేస్తున్న నా బిడ్డలాంటి హరిప్రియను భారీ మెజార్టీతో గెలిపించాలి.’ అని బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపునిచ్చారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు మండలం బొజ్జాయిగూడెంలో బుధవారం నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో ఆయన మాట్లాడారు. ‘గత ఎన్నికల్లో పది హామీలిచ్చి వంద పనులు చేసినం.. ఎన్నికలు వస్తయ్.. పోతయ్.. మిమ్మల్ని ఒకటే ప్రార్థిస్తున్నా.. ప్రజలు ఇంకా పరిణితి చెందాలి. ఓటు వేసేటప్పుడు ఆలోచించాలి. మంచి ఆలోచనతో ఓటు వేస్తే మంచి పాలన మన దగ్గరకు వస్తుంది. కేసీఆర్ చెప్పిన మాటల గురించి గ్రామాల్లో చర్చ పెట్టండి. మంచి ఎమ్మెల్యేను గెలిపిస్తే మంచి ప్రభుత్వం వస్తుంది. ఓటు మీచేతిలోనే ఉంది. ఆగం కావద్దు’ అని సూచించారు.
భద్రాద్రి కొత్తగూడెం, నమస్తే తెలంగాణ/ ఇల్లెందు, నవంబర్ 1: గత ఎన్నికల్లో పది హామీ లిచ్చి వంద పనులు చేశామని ముఖ్యమంతి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గుర్తుచేశారు. ఇల్లెందు నియోజకవర్గం ఉద్యమాల పురిటిగడ్డ అని అన్నా రు. ఇక్కడి నుంచి బీఆర్ఎస్ తరఫున పోటీ చేస్తు న్న తన బిడ్డలాంటి హరిప్రియను గెలిపించాలని పిలుపునిచ్చారు. ‘ఎన్నికలు వస్తాయి. పోతాయి. అవి జరిగేది ఖాయం. మిమ్మల్ని ఒకటే ప్రార్థిస్తు న్నా. ప్రజలు ఇంకా పరిణితి చెందాలి. ఓటు వేసే టప్పుడు ఆలోచించాలి. మంచి ఆలోచనతో ఓటు వేస్తే మంచి పాలన మన దగ్గరకు వస్తుంది. కేసీఆర్ చెప్పిన మాటల గురించి గ్రామాల్లో చర్చ పెట్టండి.’ అని అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు మండలం బొజ్జాయిగూడెంలో బుధవారం జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో ఆయ న మాట్లాడారు. మంచి ఎమ్మెల్యేను గెలిపిస్తే మంచి ప్రభుత్వం వస్తుందని అన్నారు. ఓటు మీ చేతిలో ఉందని, ఆగం కావద్దని విజ్ఞప్తి చేశారు. సన్నాసులకు ఓట్లు వేయొద్దని సూచించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఏంచేసిందని కొంతమంది అంటున్నారని, మరి ఏం చేసిందో మీ అందరికీ తెలుసునని అన్నారు. పది హమీలిచ్చి వంద పను లు చేశామని గుర్తుచేశారు. రైతుబంధు, దళిత బంధు, రైతుబీమా, మిషన్ భగీరథ వంటి పథకా లను చెప్పకుండానే చేశామని వివరించారు. కరెంటుపై ప్రధాని మోదీ పిచ్చిమాటలు మాట్లా డుతున్నాడని సీఎం కేసీఆర్ విమర్శించారు.
రైతుల వ్యవసాయ మోటర్లకు మీటర్లు పెట్టా లంటూ ఒత్తిడి తెస్తున్నారని అన్నారు. అది ఎంత వరకూ సమంజసమో మోదీయే చెప్పాలని ప్ర శ్నించారు. అందుకే తన తలతెగిపడ్డా రైతుల మో టర్లకు మీటర్ల పెట్టనని స్పష్టం చేశానని అన్నారు. ఒకనాడు నీళ్లులేక బీళ్లుగా ఉన్న తెలంగాణలో ఇప్పుడిప్పుడే రైతులు ముఖాలు పచ్చగా కన్పి స్తున్నాయని అన్నారు. ఇలాంటి సమయంలో రైతులకు రైతుబంధు ఇచ్చి ఆదుకున్నానని గుర్తు చేశారు. అందుకే రాష్ట్రంలో 3 కోట్ల మిలియన్ టన్నుల ధాన్యం దిగుబడి వచ్చిందని వివరించా రు. త్వరలో సీతారామ ప్రాజెక్టు పూర్తయితే మరో కోటి టన్నుల ధాన్యం దిగుబడి కూడా వస్తుందని అన్నారు. కాంగ్రెస్ నాయకులు ఏవో పిచ్చికూత లు కూస్తున్నారని విమర్శించారు. వారి పాలనలో రూ.200 పింఛను ఇస్తే.. మన ప్రభుత్వంలో రూ.2016, రూ.4016 చొప్పున పింఛన్లు ఇస్తు న్నామని వివరించారు. ఎమ్మెల్యే హరిప్రియకు ఒక చరిత్ర ఉందని, ఈ నియోజకవర్గంలో 45 వేల ఎకరాలకు పోడుపట్టాలు ఇప్పించారని వివరించారు. ఈ ఎన్నికల్లో ఆమెను భారీ మెజా రిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను అసెంబ్లీ గేట్లు తాకనివ్వబోమంటూ కొంతమంది నాయకులు మాట్లాడుతున్నారని అన్నారు. కానీ అసెంబ్లీ గేట్లు తాకనిచ్చేది వాళ్లు కాదని, మీరేనని ప్రజలను ఉద్దేశించి అన్నారు. ఓట్లు వేసేది మీరని, భవిష్యత్ మీ చేతుల్లోనే ఉంద ని అన్నారు. అభివృద్ధిని చూసి ఓట్లు వెయ్యాలని అన్నారు. మళ్లీ మనమే గెలవబోతున్నామని, హరి ప్రియ చెప్పిన విధంగా కొమరారాన్ని మండలం చేసుకుందామని అన్నారు. గెలిచాక మళ్లీ వచ్చి మీ మధ్యలోనే ఉండి మరోసారి మాట్లాడు కుందామని అన్నారు.
గిరిజనులను భూ యజమానులను చేసిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిదే..
ఇల్లెందు ప్రజా ఆశీర్వాద సభలో బీఆర్ఎస్ అభ్యర్థి హరిప్రియానాయక్
ఏజెన్సీలో పోడు భూములకు పట్టాలిచ్చిన మహానేత సీఎం కేసీఆర్ అని ఇల్లెందు ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నియోజకవర్గ అభ్యర్థి హరిప్రియా నాయక్ పేర్కొన్నారు. గిరిజనులను పోడు భూ ములకు యజమానులను చేసిన ఘనత బీఆర్ ఎస్ ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు. మండ లంలోని బొజ్జాయిగూడెంలో బుధవారం ఏర్పా టు చేసిన ప్రజా ఆశీర్వాద సభలో ఆమె మాట్లా డారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సహకారంతో ఇల్లెందు నియోజకవర్గంలో కనీవినీ ఎరుగని రీతిలో అభివృద్ధి పనులు జరిగాయని, సంక్షేమ పథకాలు అమలయ్యాయని అన్నారు. కేవలం అభివృద్ధి పనులకే రూ.3001.19 కోట్లు వెచ్చించి నట్లు చెప్పారు. ఏజెన్సీ ప్రాంతమైన ఇల్లెందు నియోజకవర్గంలో విద్య, వైద్య సౌకర్యాలను మెరుగుపరిచిన ఘనత సీఎం కేసీఆర్‌దేనని అన్నా రు. బయ్యారంలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయ కుండా కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం మోసం చేస్తే.. ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నోరు మెదపకుండా ఈ ప్రాంతానికి అన్యాయం చేసింద ని దుయ్యబట్టారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశీర్వా దంతో మీ ఆడబిడ్డగా మీ ముందుకు వచ్చిన తనను నియోజకవర్గ ప్రజలు నిండు మనసుతో దీవించాలని కోరారు. మంత్రులు పువ్వాడ అజ య్‌కుమార్, సత్యవతి రాథోడ్, ఎంపీలు నామా నాగేశ్వరరావు, మాలోత్ కవిత, వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనా చారి, జీహెచ్ఎంసీ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ దిండిగాల రాజేందర్, ఎమ్మెల్యేలు రేగా కాంతారా వు, వనమా వెంకటేశ్వరరావు, మహబుబాబాద్ జడ్పీ చైర్మన్ ఆంగోత్ బిందు, బీఆర్ఎస్ నాయ కులు, ఇతర ప్రజాప్రతినిధులు కోనేరు చిన్ని, దమ్మాలపాటి వెంకటేశ్వరరావు, జానీపాషా, ఎస్ రంగనాథ్, నాదెండ్ల శ్రీనివాసరెడ్డి, వరప్రసాద్, శీలం రమేశ్, హన్మంతరావు, తాతా గణేశ్, లక్ష్మణ్‌నాయక్, జేకే శ్రీను, కుంటా నవాబ్ తదితరులు పాల్గొన్నారు.