హనుమకొండ చౌరస్తా : గ్రామీణ స్థాయి క్రీడాకారులను ప్రోత్సహించాలని ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం సీఎం కప్ ( CM Cup ) క్రీడలు నిర్వహిస్తుందని ఒలంపిక్ అసోసియేషన్ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు, హనుమకొండ జిల్లా గ్రంధాలయ చైర్మన్ మమహ్మద్ అజిజ్ఖాన్( Ajij Khan ) , డీవైఎస్వో గుగులోతు అశోక్‌కుమార్ అన్నారు. సీఎం కప్ 2025 రెండవ ఎడిషన్ టార్చ్ ర్యాలీని ప్రారంభించారు.
ఈ సందర్భంగా అజీజ్ ఖాన్ మాట్లాడుతూ ప్రతి గ్రామంలో క్రీడలపై అవగాహన పెంచేందుకు సీఎం కప్ ర్యాలీ నిర్వహిస్తున్నామని తెలిపారు. అడిషనల్ కలెక్టర్ రవి, హనుమకొండ యువజన క్రీడా అధికారి గుగులోత్ అశోక్‌కుమార్ మాట్లాడుతూ సీఎం కప్ పోటీలు రెండు రోజులపాటు జిల్లాలోని అన్ని మండలాలలో నిర్వహిస్తున్నామని వివరించారు.
మొదటి రోజు జేఎన్ఎస్ నుంచి ప్రారంభమైన ర్యాలీ వివిధ ప్రాంతాల గుండా జేఎన్ఎస్ కు చేరుకుంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో అథ్లెటిక్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు వరద రాజేశ్వరరావు, రాష్ట్ర కార్యదర్శి సారంగపాణి పాల్గొన్నారు.