మహబూబాబాద్, సెప్టెంబర్ 12 (నమస్తే తెలంగాణ) : మీసేవ కేంద్రాల్లో మూడు రోజులుగా పౌర సేవలు నిలిచిపోయాయి. హైదరాబాద్లోని మెయిన్ సర్వర్లో సాంకేతిక సమస్య తలెత్తడంతో సేవలకు అంతరాయం ఏర్పడింది.
కులం, నివాసం, ఆదాయం తదితర ధ్రువీకరణ పత్రాలతో పాటు రెవెన్యూ, పోలీస్, విద్యుత్ సంస్థకు సంబంధించిన 40 రకాల సేవలను ప్రజలు వినియోగించుకుంటున్నారు. మూడు రోజులుగా సేవలు నిలిచిపోవడంతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా దరఖాస్తుదారులు తీవ్ర ఇబ్బందులు ఎదురొంటున్నారు. దీంతో దరఖాస్తుదారులు మీసేవ కేంద్రాల చుట్టూ తిరిగి విసుగు చెందుతున్నారు.