నమస్తే తెలంగాణ నెట్వర్క్: జిల్లావ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలు బుధవారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ప్రత్యేకంగా అలంకరించిన చర్చిల్లో క్రిస్టియన్లతో కలిసి ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు ప్రార్థనలు చేశారు. నర్సంపేట పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో విద్యార్థి సంఘాల నాయకుడు ఉత్తమ్‌కుమార్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన భారీ కేక్‌ను ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి కట్ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మాట్లాడారు. యేసు క్రీస్తు బోధనలు ప్రపంచ శాంతికి సందేశాలు అన్నారు. అంతేకాకుండా చెన్నారావుపేట మండలం తిమ్మరాయిన్పహాడ్ గ్రామంలోని పునీత రాయప్ప చర్చిలో ఫాదర్ యాగారెడ్డి ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో దొంతి పాల్గొన్నారు. ప్రజలు శాంతియుతంగా జీవించాలని కోరారు. నెక్కొండలోని పరిశుద్ధ లూకా దేవాలయంలో క్రైస్తవులు ప్రార్థనలు చేశారు. నల్లబెల్లిలోని సీఎస్ఐ పరితోమా దేవాలయంతోపాటు జీసస్ గస్పల్ బాప్టిస్ట్ చర్చిలో రెవరన్ ఈసంపల్లి ప్రసాద్, మత్తయ్ ఆధ్వర్యంలో క్రిస్టియన్లు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఖానాపురం మండలవ్యాప్తంగా చర్చిల్లో పాస్టర్లు కేక్‌లు కట్ చేసి శాంతి సందేశాన్ని వినిపించారు. బుధరావుపేట, ఖానాపురంలో జరిగిన ప్రార్థనల్లో ఎస్సై రఘుపతి పాల్గొన్నారు.
ఖిలావరంగల్ పడమరకోటలోని జరిగిన కార్యక్రమాల్లో 37, 38 డివిజన్ల కార్పొరేటర్లు వేల్పుగొండ సువర్ణ, బైరబోయిన ఉమ హాజరై కేక్ కట్ చేశారు. దుగ్గొండి మండలంలోని చర్చిల్లో క్రిస్టియన్లు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. వరంగల్ మండిబజార్‌లోని సెంటినరీ ట్రినిటీ బాప్టిస్ట్ చర్చిలో ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. మండిబజార్‌లోని టీపీసీ చర్చిలో తూర్పు మాజీ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ హాజరై కేక్ కట్ చేసి క్రిస్టియన్లకు శుభాకాంక్షలు తెలిపారు. రాయపర్తిలోని మన్నా చర్చితోపాటు అన్ని గ్రామాల్లో క్రైస్తవులు క్రిస్మస్ వేడుకలు నిర్వహించుకున్నారు. సంగెం మండలంలోని చర్చిల్లో కేక్‌లు కట్ చేసి పంపిణీ చేశారు. గవిచర్ల చర్చిలో మాజీ సర్పంచ్ దొణికెల రమా శ్రీనివాస్ పేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు. అంతేకాకుండా వరంగల్ 18వ డివిజన్ భగత్‌సింగ్‌నగర్‌లోని బేతెస్థ చర్చిలో జరిగిన ప్రత్యేక ప్రార్థనల్లో మాజీ ఎమ్మెల్యే నన్నపునేని పాల్గొన్నారు. వరంగల్ 3వ డివిజన్ పైడిపల్లి సీబీసీ, 18వ డివిజన్ లేబర్‌కాలనీలోని సీబీసీ, ఎనుమాముల, కాశీబుగ్గ, కొత్తపేట, ఆరెపల్లిలోని చర్చిల్లో క్రిస్టియన్లు ప్రార్థనలు చేశారు. పర్వతగిరి మండలంలోని ఏనుగల్లు బెరెకా బాప్టిస్ట్ చర్చిలో ఏర్పాటు చేసిన వేడుకల్లో వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు పాల్గొని కేక్ కట్ చేశారు. గ్రామానికి చెందిన మహిళా నాయకురాలు తొర్రి పద్మా కుమారస్వామి ఆధ్వర్యంలో పేద క్రైస్తవులకు చీరెలు పంపిణీ చేశారు. వర్ధన్నపేట మండలంలోని చర్చిల్లో కేక్‌లు కట్ చేసి మిఠాయిలు పంపిణీ చేశారు.