ఏటూరునాగారం : ఉమ్మడి ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలోని గిరిజనులను అభివృద్ధి చేయడమే ఐటీడీఏ లక్ష్యమని పీవో చిత్రా మిశ్రా పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవంతో పాటు ఐటీడీఏ 50 వసంతాల సందర్భంగా ఏర్పాటు చేసిన వేడుకల్లో పీవో పాల్గొని మాట్లాడారు. గిరిజన విద్యాసంస్థల్లో ఉన్న మేజర్, మైనర్ మరమ్మతులకు రూ. 8 కోట్లతో పనులు చేపడుతున్నట్లు తెలిపారు. నేషనల్ హెల్త్ మిషన్ నిధుల ద్వారా ధర్మవరం, లింగాల తిమ్మాపూర్, రామన్నగూడెం, కోడిసెల మిట్ట, బర్లగూడెం, బయక్కపేట, జంగవానిగూడెం తిమ్మాపురం గ్రామాల్లోని సబ్ సెంటర్లను రూ.1.44 కోట్లతో మరమతులు చేస్తున్నట్లు వివరించారు.
ఆర్టికల్ 275 పథకం కింద నర్సంపేట లోని కురవి లో అడిషనల్ డార్మటరీ బ్లాక్ కు అనుమతులు మంజూరు చేశామని తెలిపారు. ఇలా అనేక అభివృద్ధి పనులు చేపట్టినట్లు ఆమె పేర్కొన్నారు. కార్యక్రమంలో ఏవో రాజ్ కుమార్, మేనేజర్ శ్రీనివాస్, అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్ సంతోష్, స్టాటిస్టికల్ ఆఫీసర్ సురేష్ బాబు, డిప్యూటీ డీఎంహెచ్వో క్రాంతి కుమార్, అకౌంట్స్ మేనేజర్ నర్సింగ్, ఏటిడిఓ క్షేత్రయ్య, డిప్యూటీ తాసిల్దారులు అనిల్ కిషోర్, పేసా కోఆర్డినేటర్ ప్రభాకర్, జియాలజిస్ట్ కిషోర్ ఏసీఎంఓ వాగ్య నాయక్, జి సి డి ఓ సుగుణ, ప్రాజెక్టు మేనేజర్ మహేందర్, టెక్నికల్ ఆఫీసర్ సురేష్ ,తదితరులు పాల్గొన్నారు.