నర్సంపేట, జనవరి20 : చిట్‌ఫండ్ డబ్బులు ఇవ్వడం లేదని ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన వరంగల్ జిల్లా నర్సంపేటలో చోటు చేసుకుంది. శుభనందిని చిట్‌ఫండ్‌లో చిట్టి ఎత్తి ఏడాది గడిచినా ఇంతవరకు డబ్బులు ఇవ్వకపోవడంతో గురువారం ములుగు జిల్లా కేంద్రానికి చెందిన రాజు తాడును వెంట తెచ్కుకుని ఆత్మహత్యా యతాన్నికి పాల్పడ్డాడు.
వివరాల్లోకి వెళ్తే.. రాజుకు ఇద్దరు కూతుళ్లు ఉండగా, డబ్బులు పొదుపులు చేయడానికి నర్సంపేటలోని శుభనందిని చిట్స్‌లో రూ. అయిదు లక్షల చిట్టి వేశాడు. ఏడాది కిందట పూర్తయ్యింది. బాధితుడికి రూ.4.50 లక్షలు ఇవ్వాల్సి ఉండగా, చిట్‌ఫండ్ యాజమాన్యం చెక్కులు ఇచ్చింది.
కానీ బ్యాంకులో డబ్బులు లేక పోవడంతో వాటిని పట్టుకుని ఏడాది కాలంగా శుభనందిని చిట్‌ఫండ్ చుట్టు తిరుగుతున్నాడు. చివరికి బాధితుడ రాజు గురువారం గ్యాస్ పట్టుకుని కార్యాలయానికి వచ్చి ఆత్మహత్యాయత్నం చేసుకోవాలనికి ప్రయత్నించగా, సిబ్బంది దాన్ని లాక్కొని బాత్రూంలో దాచిపెట్టారు. పురుగుల మందు డబ్బా పట్టుకుని నిరసన తెలిపాడు.
వెంట తెచ్చుకున్న తాడుతో ఉరి వేసుకుని చస్తానని అనడంతో ఉద్యోగులు లాక్కొన్నారు. తనకు చిట్టీ డబ్బులు చెల్లించక పోవడం వల్ల అప్పుల పాలయ్యానని బాధితుడు వాపోయాడు. తనకు చిట్టి డబ్బులు ఇవ్వాలని కోరినా నిర్వాహకులు డబ్బులు ఇవ్వకపోగా, మేనేజర్లు మారిపోయారని సమాధానం చెబుతూ దాట వేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు.
చివరకు వారం రోజులలోపు తప్పనిసరిగా డబ్బులు ఇస్తానని ఉద్యోగులు హామీ ఇవ్వడంతో ఇంటికి వెళ్లిపోయాడు.