మిర్చి ధర.. సగానికి కోత
వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ పరిధిలోని మిర్చి రైతులు సోమవారం ఆందోళనకు దిగారు. తేజ మిర్చి క్వింటాల్‌కు జెండా పాట రూ.20,100 కాగా రూ.12వేల నుంచి రూ.17వేలకే వ్యాపారులు కొనుగోలు చేస్తున్నారని రైతులు మండిపడ్డారు. కావాలనే మిర్చి ఖరీదు వ్యాపారులు సిండికేట్‌గా మారి నాణ్యతలేమి పేరిట తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
- మిరప రైతుల ఆందోళన
- ఎనుమాముల మార్కెట్ వద్ద రెండు గంటల పాటు రాస్తారోకో
- అధికారుల హామీతో విరమణ
- 4గంటలు కాంటాలు ఆలస్యం
- జేడీఎంతో డీసీపీ, ఏసీపీ, రైతుల సమావేశం
- తక్కువ ధర పడ్డవారివి పరిశీలన
కాశీబుగ్గ, జనవరి 8 : వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ పరిధిలోని మిర్చి రైతులు సోమవారం ఆందోళనకు దిగారు. తేజ మిర్చి క్వింటాల్‌కు జెండా పాట రూ.20,100 కాగా రూ.12వేల నుంచి రూ.17వేలకే వ్యాపారులు కొనుగోలు చేస్తున్నారని రైతులు మండిపడ్డారు. కావాలనే మిర్చి ఖరీదు వ్యాపారులు సిండికేట్‌గా మారి నాణ్యతలేమి పేరిట తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పెద్ద ఎత్తున మిర్చి కార్యాలయం వద్దకు చేరి ఆందోళనకు దిగారు. దీంతో కాంటాలు నిలిచిపోగా మార్కెట్ ప్రాంగణంలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. అక్కడి నుంచి ర్యాలీగా మార్కెట్ ప్రధాన కార్యాలయానికి చేరుకొని నిరసన తెలిపి ప్రధాన మార్కెట్ గేటు దగ్గరకు చేరుకున్నారు. తమకు న్యాయం చేయాలని రెండు గంటల పాటు రోడ్డుపై ధర్నా చేశారు. దీంతో ట్రాఫిక్ నిలిచిపోయి వాహనదారులకు ఇబ్బందులు తలెత్తాయి. వెంటనే ఎనుమాముల సీఐ ఏ మహేందర్ అక్కడికి చేరుకొని రైతులతో మాట్లాడి వారి సమస్యను మార్కెట్ కమిటీ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకుపోయారు.
ధర్నా విరమించి అధికారులతో సమావేశం నిర్వహించేందుకు రావాలని కోరగా వారు ప్రధాన కార్యాలయానికి చేరుకున్నారు. వెంటనే జేడీఎం ఎన్నారపు మల్లేశం, డీఎంవో పాలకుర్తి ప్రసాదరావు, కార్యదర్శి క్యారం సంగ య్య, వరంగల్ డీసీపీ పుప్పాల రవీందర్, మామునూరు ఏసీపీ సీ సతీశ్‌బాబు, సీఐ మహేందర్, చాంబర్ అధ్యక్ష కార్యదర్శులు బొమ్మినేని రవీందర్‌రెడ్డి, మడూరి వేదప్రకాశ్, అడ్తి సెక్షన్ అధ్యక్షులు ఎన్రెడ్డి లింగారెడ్డి సంబంధిత రైతులతో సమావేశమై సమ స్య తెలుసుకున్నారు. మూడు గంటలపాటు ఇరువర్గాలవారు చర్చించి తక్కువ ధర వచ్చిన రైతుల సరుకును పరిశీలించి ధరలు పెంచే విధంగా కృషి చేస్తామని, ధరలు నచ్చని రైతులు మరుసటి రోజు అ మ్ముకోవాలని సూచించారు. తక్కువ ధర పడ్డ రైతుల సరుకులను పరిశీలించి కొంత వరకు ధర పెంచి కొనుగోలు చేపట్టారు. మధ్యాహ్నం నుంచి మిర్చి కాంటాలు యథావిధిగా కొనసాగాయి. సోమవారం మార్కెట్‌కు సుమారు 10వేల మిర్చి బస్తాలు వచ్చినట్లు మార్కెట్ వర్గాలు తెలిపాయి.
మిర్చి రైతులకు న్యాయం చేయాలి
వరంగల్ మార్కెట్‌కు వ్యవసాయ ఉత్పత్తులను తీసుకువచ్చే రైతులను దోచుకుంటున్నారు. ఈ పద్ధతి మారాలి. రైతులకు న్యాయం జరిగేలా అధికారులు చర్యలు తీసుకోవాలి. సమస్యను పరిష్కరించుకుండా నిర్లక్ష్యం చేస్తే ఆందోళనలు ఉధృతం చేస్తాం.
– సోమిడి శ్రీనివాస్, తెలంగాణ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు
Read Today's Latest Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

