కాశీబుగ్గ, జూలై 15: అంగన్వాడీ సెంటర్లలో ప్రాథమిక విద్యను ప్రోత్సహించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయని జిల్లా సంక్షేమ అధికారి హైమావతి అన్నారు. గ్రేటర్ వరంగల్ 3, 21, 23వ డివిజన్లలో అమ్మ మాట అంగన్వాడీ బాట కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అవగాహన ర్యాలీలు తీశారు. అనంతరం 3వ డివిజన్ పరిధిలోని 14 అంగన్వాడీ సెంటర్ల నిర్వాహకులతో ఆమె సమావేశం ఏర్పాటు చేశారు. మూడేళ్లు నిండిని పిల్లలను విధిగా అంగన్వాడీ సెంటర్లలో చేర్పించాలని హైమవతి తల్లిదండ్రులను కోరారు. ఈ కేంద్రాల్లో ప్రాథమిక విద్యనభ్యసించే పిల్లల సంఖ్యను మరింత పెంచాలని నిర్వాహకులకు సూచించారు. కార్యక్రమంలో సూపర్వైజర్ జె.లావణ్య, ఎం.వెంకటేశ్వరి, భాగ్యమ్మ, అంగన్వాడీ టీచర్లు రాజేశ్వరి, జ్యోత్స్న, మంజులారాణి, సుజాత, రాణి, భాగ్యలక్ష్మి, ఎలీషా, ఇష్రత్, నాగమణి, ఆశ కార్యకర్తలు మమత, పరిమల పాల్గొన్నారు.
రాయపర్తి: ప్రజలు అంగన్వాడీ కేంద్రాల్లో అందజేస్తున్న సేవలను వినియోగించుకోవాలని ఐసీడీఎస్ వర్ధన్నపేట సీడీపీవో డెబోరా అన్నారు. మండలకేంద్రంలోని జడ్పీహెచ్ఎస్ విద్యార్థులు, అంగన్వాడీ టీచర్లతో కలిసి ర్యాలీ నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాల్లో ప్రాథమిక విద్యను ప్రవేశపెట్టిందన్నారు. కార్యక్రమంలో సూపర్వైజర్ సత్యవతి, పీహెచ్సీ వైద్యురాలు ఐశ్వర్య, హెచ్ఎం గారె కృష్ణమూర్తి, అంగన్వాడీ టీచర్లు అయిత కృష్ణవేణి, వీద చంద్రకళ, అయిత విజయరాణి, ఆకారపు శశిరేఖ, గారె కవిత, ఆశ వర్కర్లు పాల్గొన్నారు.
కరీమాబాద్/నర్సంపేట: గర్భిణులు, బాలింతలు అంగన్వాడీ సేవలను వినియోగించుకోవాలని కార్పొరేటర్ పల్లం పద్మ అన్నారు. ఐసీడీఎస్ సూపర్వైజర్ బత్తిని రమాదేవి ఆధ్వర్యంలో వరంగల్ 32వ డివిజన్లో అమ్మ మాట-అంగన్వాడీ బాట కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పల్లం పద్మ మాట్లాడుతూ పిల్లలను అంగన్వాడీ సెంట ర్లలో చేర్పించాలని కోరారు. అర్హులు ప్రభుత్వం అందించే పౌష్టికాహారాన్ని వియోగించుకోవాలని సూచించారు. అనంతరం ర్యాలీ నిర్వహించి వన మహోత్సవంలో భాగంగా మొక్కలు నాటారు. అలాగే, నర్సంపేట రాంనగర్లోని అంగన్వాడీ కేంద్రంలో ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ బానాల ఇందిర మాట్లాడుతూ పిల్లలను అంగన్వాడీ కేంద్రానికి పంపించాలని కోరారు. కార్యక్రమంలో హెచ్ఎం శోభ, అంగన్వాడీ టీచర్లు బత్తిని శిరీష, నల్లా భారతి, ఎండీ గౌసియా, ఉపాధ్యాయులు రవీందర్, వెంకటేశ్వర్లు, ఏఎన్ఎం సునీత పాల్గొన్నారు.