చిట్యాల, ఏప్రిల్ 23 : వీధికుక్కల దాడిలో ఓ చిన్నారికి తీవ్ర గాయాలైన ఘటన జయశంకర్ భూపాలపల్లి చిట్యాల మండలంలోనీ జడలపేట గ్రామంలో బుధవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన సమాచారం మేరకు.. గ్రామానికి చెందిన రత్న రమేష్ కూతురు నైనిషా ఇంటి వద్ద ఆడుకుంటుంది. అక్కడే మాకం వేసిన మూడు వీధి కుక్కలు చిన్నారిని వెంటాడి తీవ్ర గాయాల పాలు చేశాయి. నైనిశా మెడ చుట్టూ, వీపులో గాయాలతో కుక్కలు దాడి చేశాయి.
హుటాహుటిన కుటుంబీకులు చిట్యాల మండల కేంద్రంలోని సివిల్ హాస్పిటల్కు తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం వరంగల్ ఎంజీఎం దవాఖానాకు తరలించారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్న ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. వీధి కుక్కల దాడిని నిర్మూలించేందుకు అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.