ఖిలావరంగల్, ఫిబ్రవరి 24: ప్రభుత్వ పాఠశాలను పరిశుభ్రంగా ఉంచుతున్న స్కావెంజర్ల వేతనాలను (Scavengers wages )వెంటనే అందించాలని ఏఐటీయూసీ వరంగల్ జిల్లా అధ్యక్షుడు చెన్నకేశవులు అన్నారు. సోమవారం వరంగల్ కలెక్టరేట్లో డీఆర్వోను విజయలక్ష్మికి స్కావెంజర్ల వేతనాలు చెల్లించాలని ఏఐటీయూసీ ఆధ్వర్యంలో వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొన్నేళ్లుగా ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న స్కావెంజర్లను క్రమబద్ధీకరిస్తే జీవితాలు చక్కబడుతాయి అనుకుంటే ప్రభుత్వం నుంచి కేటాయించినటువంటి కనీస వేతనం గత ఏడాది జూన్ నుండి ఇప్పటి వరకు ఇవ్వకుండా స్కావెంజర్ల జీవితాలతో చెలగాటమాడుతున్నారన్నారు.
2024 జూన్ నుండి నేటి వరకు బిల్లులను విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. అంతేకాకుండా కనీస వేతన సవరణ చట్టం ప్రకారం నెలకు రూ.26000 ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాగి జావా కింద నెలకు రూ.2000 ఇస్తామని చెప్పిన ప్రభుత్వం ఇప్పటి వరకు మంజూరు చేయకపోవడంతో దుర్భరమైన జీవితం గడుపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా సహాయ కార్యదర్శి మియాపురం గోవర్ధనాచారి, జిల్లా కార్యవర్గ సభ్యులు బొట్ల శ్రీనివాస్, స్కావెంజర్స్ఎండీ సైదాబీ, రామారావు, ఎండీ పాషా, సుభాన, విజయ, మేకల కవిత, సూరయ్య, వినోద్, పద్మ, సునీత, విజయ, రమ, దొనికెల లక్ష్మి, శ్వేత, బట్టు స్వరూప, పుష్పమ్మ, తదితరులు పాల్గొన్నారు.