హనుమకొండ/వరంగల్, జూన్ 12 : నగరంలో ఇద్దరు ఐఏఎస్‌లు బదిలీ అయ్యారు. హనుమకొండ జిల్లా కలెక్టర్ పీ ప్రావీ ణ్య సంగారెడ్డి కలెక్టర్‌గా బదిలీ అయ్యారు. జీహెచ్ఎంసీ అదనపు కమిషనర్ స్నేహా షబరీష్కు హనుమకొండ కలెక్టర్‌గా పోస్టింగ్ ఇచ్చారు. కాగా ప్రావీణ్య గతంలో గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ కమిషనర్‌గా, వరంగల్ కలెక్టర్‌గా విధులు నిర్వర్తించి హనుమకొండ కలెక్టర్‌గా 2024 జూన్ 16న బాధ్యతలు స్వీకరించారు. సుమారు సంవత్సరం పాటు కలెక్టర్‌గా పనిచేసి జిల్లా ప్రజల మన్న నలు పొందారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను అర్హులకు అందించడంలో కృషి చేశారు.
వరంగల్, హనుమకొండ జిల్లాలో మంచి పట్టున్న అధికారిగా పేరు గడించారు. కలెక్టర్‌గా ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించడంతో పాటు ఉమ్మడి వరంగల్ జిల్లా స్థాయి సమావేశాలు ఏర్పాటు చేసి సఫలీకృతలయ్యారు. స్థానిక ప్రజాప్రతినిధులు, ఉద్యోగులను సమన్వయం చేసుకుంటూ ప్రభుత్వ కార్యక్రమాలను విజయవంతంగా పూర్తి చేశారు. అదేవిధంగా వరంగల్ మహా నగరపాలక సంస్థ కమిషనర్‌గా 2019 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారి చాహత్ బాజ్‌పాయ్ నియమితులయ్యారు.
ఈమె కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గా విధులు నిర్వర్తిస్తుండగా గురువారం బదిలీ అయ్యింది. బాజ్‌పాయ్ గతంలో ఉట్నూర్ ఐటీడీ ఏ ప్రాజెక్ట్ అధికారిగా, అసిఫాబాద్ అదనపు కలెక్టర్‌గా పనిచేశారు. ఇప్పటి వరకు గ్రేటర్ కమిషనర్‌గా బాధ్యతలు నిర్వర్తించిన అశ్విని తానాజీ వాకడే కరీంనగర్ ఆదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) గా బదిలీ అయ్యారు. ఈమె 15 నెలల పాటు పనిచేశారు. 2024 మార్చి 14వ తేదీన గ్రేటర్ వరంగల్ కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టారు.