హనుమకొండ చౌరస్తా, డిసెంబర్ 16: విశాఖ ఇండస్ట్రీ సౌజన్యంతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ వరంగల్ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ సంయుక్తంగా నిర్వహిస్తున్న కాకా వెంకటస్వామి మెమోరియల్ తెలంగాణ ఇంటర్ డిస్ట్రిక్ట్ లీగ్ టోర్నమెంట్లో పాల్గొనే ఉమ్మడి వరంగల్ జిల్లా క్రికెట్ జట్లను ఎంపిక చేసినట్లు వరంగల్ జిల్లా క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి చాగంటి శ్రీనివాస్ తెలిపారు. జట్ల ఎంపికలో భాగంగా వంగాలపల్లిలోని వరంగల్ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ క్రికెట్ గ్రౌండ్లో నిర్వహించిన ఈ సెలెక్షన్స్‌కి వరంగల్, హనుమకొండ, ములుగు, జనగాం, మహబూబాబాద్ భూపాలపల్లి జిల్లాలకి చెందిన క్రీడాకార్లు సుమారు 250మందికి పైగా పాల్గొన్నట్లు చెప్పారు.
బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్‌లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను సెలెక్షన్స్కమిటీ ఎంపిక చేసి, ఎంపికైన ఈ 6జిల్లా జట్లు ఈనెల 24 నుంచి 27 వరకు ములుగు జిల్లాలో జాకరం పోలీసు క్రికెట్ గ్రౌండ్, వంగాలపల్లిలోగల వరంగల్ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ గ్రౌండ్ మొగిలిచర్ల క్రీడామైదానాల్లో జరిగే ఇంట్ర డిస్ట్రిక్ట్ పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు తోట రాము, సంయుక్త కార్యదర్శి ఉపేందర్, కార్యవర్గ సభ్యులు అభినవ వినయ్, శంకర్ పాల్గొన్నారు.